Weight Loss Tips: పెళ్లికి ముందు బరువు తగ్గండి.. సులువుగా బెల్లీఫ్యాట్‌ కరిగించండి..!

Lose Weight Before Marriage Melt Belly Fat Easily
x

Weight Loss Tips: పెళ్లికి ముందు బరువు తగ్గండి.. సులువుగా బెల్లీఫ్యాట్‌ కరిగించండి..!

Highlights

Weight Loss Tips: అధిక బరువు కలవారు పెళ్లి కుదరడంతో చాల టెన్షన్‌ పడుతారు.

Weight Loss Tips: అధిక బరువు కలవారు పెళ్లి కుదరడంతో చాల టెన్షన్‌ పడుతారు. వివాహ వేడుకలో అగ్లీగా కనిపిస్తామని బాధపడుతారు. దీంతో మరింత ఒత్తిడి, ఆందోళనకి గురై ఇంకా బరువు పెరుగుతారు. ఇలాంటి వారు ఎలాంటి టెన్షన్ పడవద్దు. పెళ్లికి ముందు అంటే ఒక నెల లేదా రెండు నెలల సమయం ఉంటే సులువుగా బరువు తగ్గవచ్చు. పొట్ట దగ్గర ఉండే బెల్లీఫ్యాట్‌ని కరిగించవచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

జిడ్డు ఆహారం తినవద్దు

భారతదేశంలోని ప్రజలు వేయించిన ఆహారం అంటే చాలా ఇష్టపడుతారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అధిక నూనెతో చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి. వివాహానికి రెండు నెలల ముందు నుంచి వేయించిన ఆహారాలు, బిర్యానీలు, ఫ్రై కర్రీస్‌, మాంసం ఎక్కువగా తినడం వంటివి చేయకండి. కేవలం లైట్‌ ఫుడ్‌ అలవాటు చేసుకోండి.

తాజా పండ్లు, కూరగాయలను బెస్ట్‌

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అందుకే వీటిని రోజూ తినాలి. యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, బచ్చలికూర, క్యాబేజీ వంటివి బరువు పెరగనివ్వవు.

ఉదయాన్నే ఈ డ్రింక్

ప్రతిరోజు ఉదయం నుంచే బరువు తగ్గించాలి. ఇందుకోసం ఉదయాన్నే ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో ఒక టీస్పూన్ తేనె వేసి సగం నిమ్మకాయను పిండి తాగడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే పొట్ట దగ్గర ఉండే బెల్లీఫ్యాట్‌ కరుగుతుంది.

ప్రతిరోజు నడక

బరువు తగ్గడానికి మంచి ఆహారంతో పాటు సరైన వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 10,000 అడుగులు నడవాలి. దీన్ని ట్రాక్ చేయడానికి మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. లేదా మొబైల్ యాప్ సహాయంతో కూడా లెక్కించవచ్చు. ఇలా చేస్తే రెండు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories