Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే లివర్‌ ఇన్‌ఫెక్షన్‌.. సకాలంలో గుర్తించకపోతే..!

Liver infection symptoms treatment more things
x

Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే లివర్‌ ఇన్‌ఫెక్షన్‌.. సకాలంలో గుర్తించకపోతే..!

Highlights

Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే లివర్‌ ఇన్‌ఫెక్షన్‌.. సకాలంలో గుర్తించకపోతే..!

Liver Infection: మన శరీరంలోని అతి ముఖ్యమైన, పెద్ద అవయవాలలో కాలేయం ఒకటి. ఇది శరీరానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విధులను నెరవేర్చడంలో సహాయపడుతుంది. ఈ పరిస్థితిలో కాలేయంలో ఏదైనా సమస్య తలెత్తితే అనేక తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లివర్‌లో ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఉంటే చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల కాలేయ వ్యాధి లక్షణాలు శరీరంలో కనిపిస్తే తక్షణ చికిత్స అవసరం. లివర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం.

లివర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు

కాలేయ వ్యాధి ప్రారంభ దశలో తీవ్రమైన కడుపు నొప్పి మొదలవుతుంది. అంతే కాకుండా కొందరిలో ఉబ్బరం సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా కాలేయానికి సంబంధించిన సమస్య ఉంటే జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో రోగికి తక్షణ చికిత్స అవసరం.

లివర్ ఇన్ఫెక్షన్ ఉంటే చర్మంపై దద్దుర్ల సమస్యలు రావొచ్చు. మూత్రం రంగు మారితే లివర్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాలేయ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులు ఆకలిని కోల్పోతారు. కొందరికి లివర్ ఇన్ఫెక్షన్ వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.

లివర్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి రోగులు జీవనశైలిని మార్చుకోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. నూనె, సుగంధ ద్రవ్యాల వాడకాన్ని తగ్గించాలి. తగినంత నీరు తాగాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సీజనల్‌ పండ్ల, కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం తినడం తగ్గించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories