Heatwave Alert: హీట్‌వేవ్‌ ప్రమాదంలో కళ్లు, చర్మం.. కాపాడుకోవాలంటే ఇవి పాటించాల్సిందే..!

Learn From Experts how to Protect Eyes Skin in Case of Heatwave
x

Heatwave Alert: హీట్‌వేవ్‌ ప్రమాదంలో కళ్లు, చర్మం.. కాపాడుకోవాలంటే ఇవి పాటించాల్సిందే..!

Highlights

Heatwave Alert: వడగండ్ల వర్షాల తర్వాత వాతావరణం మళ్లీ నార్మల్‌ స్థితిలోకి వచ్చింది.

Heatwave Alert: వడగండ్ల వర్షాల తర్వాత వాతావరణం మళ్లీ నార్మల్‌ స్థితిలోకి వచ్చింది. దీంతో వాతావరణ శాఖ మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. మే నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా చర్మంతో పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. హీట్ వేవ్ శరీరానికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల సమయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. హీట్ వేవ్‌ను ఎలా నివారించాలో ఆరోగ్య నిపుణుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డీ హైడ్రేషన్‌

హీట్ వేవ్ ప్రమాదం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఏ వ్యక్తి అయినా డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. వేడి వేవ్‌లో అధిక చెమట శరీరం నుంచి బయటకు వస్తుంది. దీంతో శరీరం ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. దీనివల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, అలసట వంటివి వస్తాయి.

వడ దెబ్బ

హీట్ స్ట్రోక్‌లో శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. ఇది తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితిగా చెప్పవచ్చు. ఇందులో వేగవంతమైన గుండె చప్పుడుతో పాటు చర్మం పొడిబారడం మొదలవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి వీలైనంత వరకు హైడ్రేటెడ్‌గా ఉండటం మంచిది.

చర్మంపై ప్రభావం

హీట్ వేవ్ శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా చర్మంపై కూడా అధికంగా ప్రభావం చూపుతుంది. హీట్‌వేవ్ సమయంలో సూర్యుని UV కిరణాలకు గురికావడం వల్ల చర్మం దెబ్బతింటుంది. సన్‌బర్న్, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి రెండు గంటలకు 30 SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం మంచిది.

కళ్లు జాగ్రత్త

సూర్యుడి UV కిరణాల కింద ఎక్కువ సేపు ఉండటం వల్ల కళ్లకు హాని కలుగుతుంది. కళ్ళను రక్షించడానికి సన్ గ్లాసెస్ టోపీని ఉపయోగించాలి. ఎండ సమయంలో కాకుండా ఉదయం, సాయంత్రం మాత్రమే బయటికి వెళ్లాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories