Vitamin Deficiency: బాడీలో ఈ విటమిన్ల లోపమే టెన్షన్‌కి కారణం..!

Lack of These Vitamins in the Body is the Cause of Tension
x

Vitamin Deficiency: బాడీలో ఈ విటమిన్ల లోపమే టెన్షన్‌కి కారణం..!

Highlights

Vitamin Deficiency: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

Vitamin Deficiency: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది నెమ్మదిగా మొదలై రోజు రోజుకి పెరుగుతుంది. భవిష్యత్‌లో ఇదొక నిరాశకు కారణం అవుతుంది. ఇల్లు, కుటుంబం, కార్యాలయం, వ్యక్తిగత సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇది విటమిన్ల లోపం వల్ల కూడా జరుగుతుంది. ఒత్తిడిలో నివసించే వ్యక్తి మానసిక ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. భయం, చంచలత్వం పెరుగుతాయి. ఆహారంలో మార్పులు చేయడం వల్ల ఈ సమస్యలని పరిష్కరించుకోవచ్చు.

విటమిన్ B1

విటమిన్ B1ని థయామిన్ అంటారు. ఇది లేకుంటే భయంతో పాటు, డిప్రెషన్, ఆందోళన, చిరాకు, నిద్రలేమి వంటి మానసిక సమస్యలు ఉంటాయి. విటమిన్ B1 ద్వారా మెదడు గ్లూకోజ్‌ని శక్తిగా మార్చుతుంది. దీని లోపం అలసట, ఆకలిని కలిగిస్తుంది. ఆహారంలో విటమిన్ B1 మొత్తాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యలను వదిలించుకోవచ్చు.

విటమిన్ డి

ఎముకలు, కండరాల అభివృద్ధిలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని లోపం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌కు సంబంధించిన సమస్యలకు కారణం అవుతుంది. విటమిన్ డి లోపం ఆందోళన కలిగిస్తుంది. ఆహారంలో విటమిన్ డి మొత్తాన్ని పెంచడం వల్ల ఒత్తిడి, భయము, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

విటమిన్ B

తరచుగా చిరాకు పడుతూ, అలసిపోయినట్లుగా కనిపిస్తే శరీరంలో విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. ఇది లేకపోవడం వల్ల మానసిక స్థితి సరిగా ఉండదు. విటమిన్ బి సరైన మోతాదులో లభిస్తే చిరాకు అలవాటును తగ్గించవచ్చు. మానసిక ఆరోగ్యం కోసం విటమిన్లు B6, B12, B9 ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories