Health Tips: తక్కువ నిద్ర వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం.. ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!

Lack of Sleep Affects the Health Badly Many Parts of the Body are Seriously Damaged
x

Health Tips: తక్కువ నిద్ర వల్ల ఆరోగ్యం చెడు ప్రభావం.. ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!

Highlights

Health Tips: మనం రోజు మొత్తంలో కోల్పోయిన శక్తిని తిరిగి తీసుకురావడమే నిద్ర ఉద్దేశ్యం.

Health Tips: మనం రోజు మొత్తంలో కోల్పోయిన శక్తిని తిరిగి తీసుకురావడమే నిద్ర ఉద్దేశ్యం. చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజు 7 నుంచి 8 గంటల నిద్రపోవడం కచ్చితంగా అవసరం. లేదంటే అతడి ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. నేటి కాలంలో చాలామంది పని ఒత్తిడి వల్ల తక్కువ గంటలు నిద్రపోతున్నారు. దీనివల్ల కొత్త కొత్త వ్యాధులని కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర సరిగ్గా లేకుంటే జరిగే అనర్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నేటి హడావిడి జీవితం, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. దీనివల్ల ఆఫీసులో అలసిపోయినట్లు కనిపిస్తారు. వారు చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. వరుసగా చాలా రోజులు తక్కువ నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే అది ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే తగినంత నిద్ర పోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

కొన్ని చెడు అలవాట్ల వల్ల కొంతమంది సరిగ్గా నిద్రపట్టదు. ఆల్కహాల్, గంజాయి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇది శరీరంలోని అనేక భాగాలకు తీవ్రమైన హానిని కలిగిస్తుంది. అయినా కొంతమంది ఈ అలవాటును వదిలివేయరు. మత్తు వల్ల నిద్ర బాగా వస్తుందని అనుకుంటారు. కానీ కొన్ని రోజులకి దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అందువల్ల మంచి నిద్ర కోసం మద్యం, గంజాయిని ఎప్పుడూ ఉపయోగించవద్దు.

యోగా, ధ్యానం

ప్రతిరోజు ఉదయం యోగా, ధ్యానం చేయాలి. అవసరమైతే కొద్దిసేపు వాకింగ్‌ చేయాలి. దీనివల్ల మనసుకి శాంతన చేకూరుతుంది. ప్రశాంతమైన నిద్రపట్టడానికి సహాయం చేస్తుంది. టీ, కాఫీలని ఎక్కువగా తాగకూడదు. కూల్‌డ్రింక్స్‌ జోలికి అస్సలు పోకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories