White Hair Problem: తెల్లజుట్టుకి పోషకాల కొరతే కారణం.. నివారించాలంటే ఈ ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోండి..!

Lack of Nutrients is the Cause of White Hair add these foods in your Diet to Prevent it
x

White Hair Problem: తెల్లజుట్టుకి పోషకాల కొరతే కారణం.. నివారించాలంటే ఈ ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

White Hair Problem: ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు 25 ఏళ్లకంటే ముందే వస్తుంది.

White Hair Problem: ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు 25 ఏళ్లకంటే ముందే వస్తుంది. నేటి జీవనశైలిలో తెల్లజుట్టురావడానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. వాస్తవానికి తెల్లజుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ముఖ్యంగా చెప్పవచ్చు. క్రమశిక్షణతో రోజూ ఆహారం తీసుకుంటే తెల్లజుట్టు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే డైట్‌లో పోషకాల కొరత ఉండకూడదు.

తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్‌ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్‌లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్‌ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది.

తెల్ల జుట్టును సహజంగా నల్లగా

సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ B6, విటమిన్ B12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుంది. దీని కారణంగా యువత ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

విటమిన్ బి ఆహారాలు

కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకు కూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళాదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీబీన్స్ తదితర ఆహారాలు ప్రతిరోజు డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి. కొన్ని రోజులు ఇలాంటి డైట్ పాటించడం వల్ల తెల్లజుట్టు సహజసిద్దంగా నల్లగా మారే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories