Jaundice: వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. వచ్చిందంటే వీటి జోలికి పోవద్దు..!

Jaundice risk is high During Rainy Season if it occurs then these foods should not be Eaten
x

Jaundice: వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. వచ్చిందంటే వీటి జోలికి పోవద్దు..!

Highlights

Jaundice: వర్షాకాలం చల్లటి వాతావరణంతో పాటు ప్రమాదకరమైన వ్యాధులని కూడా మోసుకొస్తుంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Jaundice: వర్షాకాలం చల్లటి వాతావరణంతో పాటు ప్రమాదకరమైన వ్యాధులని కూడా మోసుకొస్తుంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కామెర్ల వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి కళ్లు పసుపురంగులోకి మారుతాయి. శరీరంలోని అనేక తెల్లని భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. మనిషి బరువు తగ్గుతాడు. ఈ వ్యాధిలో రక్తంలోకి బిలిరుబిన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహారాలకి దూరంగా ఉండాలి. లేదంటే మనిషి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఈరోజు తెలుసుకుందాం.

1. నూనె, మసాలాలు, జిడ్డు ఆహారాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరికైనా కామెర్లు సోకిందంటే మొదట అతను జిడ్డు, వేయించిన, స్పైసీ ఫుడ్ తినడం మానేయాలి. వెంటనే డైట్‌ నుంచి ఇలాంటి ఆహారాలని తీసివేయాలి. ఎందుకంటే ఇది కాలేయాన్ని మరింత దెబ్బతీస్తుంది. సింపుల్ ఫుడ్ తినడానికి ప్రయత్నించాలి.

2. టీ, కాఫీలకు దూరం

టీ, కాఫీలలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. కామెర్లు సోకిన రోగులకి ఇవి చాలా హానికరం. అందుకే కామెర్ల వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి.

3. పంచదార తగ్గించాలి

కామెర్లు నయం కావాలంటే ఆహారంలో చక్కెరని తగ్గించాలి. రిఫైన్డ్ షుగర్‌లో ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అధిక మొత్తంలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుంది. చెడ్డ కొవ్వు పేరుకుపోతుంది. అందుకే కామెర్లు వ్యాధిగ్రస్తులు తక్కువ తీపి ఉన్న పదార్థాలను తీసుకోవాలి.

4. అరటిపండ్లు తినవద్దు

పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదని అందరు అనుకుంటారు. కానీ కామెర్ల వ్యాధి సోకినప్పుడు అరటిపండు తినకూడదు. నిజానికి ఈ పండులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ ప్రక్రియ క్షీణిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో బిలిరుబిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories