Health Tips: పరగడుపున ఈ ఆకులు నమిలితే చాలా మంచిది.. ఈ వ్యాధులు దరిచేరవు..!

It is Very Good if Curry Leaves are Chewed on the Stomach These Diseases will Not Get Cured
x

Health Tips: పరగడుపున ఈ ఆకులు నమిలితే చాలా మంచిది.. ఈ వ్యాధులు దరిచేరవు..!

Highlights

Health Tips: ఆహారం తీసుకునేటప్పుడు మధ్యలో వచ్చిన కరివేపాకును చాలామంది పడేస్తారు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కరివేపాకులో చాలా ఔషధగుణాలు దాగి ఉన్నాయి.

Health Tips: ఆహారం తీసుకునేటప్పుడు మధ్యలో వచ్చిన కరివేపాకును చాలామంది పడేస్తారు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కరివేపాకులో చాలా ఔషధగుణాలు దాగి ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలోకూడా విరివిగా వాడుతారు. నిజానికి భారతీయ వంటల్లో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకు వల్ల వంటకానికి రుచి పెరుగుతుంది. చాలా మంది దీనిని మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. మరికొందరు ఇంట్లో కుండీలలో పెంచుతారు.

కరివేపాకు ఆరోగ్య నిధి

కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఐరన్‌, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 పచ్చి ఆకులను నమిలితే శరీరానికి చాలా మంచిది. దీనివల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కళ్లకు మంచిది

కరివేపాకు తినడం వల్ల రేచీకటి లేదా అనేక ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్‌లో ఉపయోగపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉన్నందున మధుమేహ రోగులు తరచుగా కరివేపాకులను నమలడం మంచిది.

జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది

కరివేపాకులను ప్రతిరోజూ ఉదయం పరగడుపున నమలాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గుతారు

కరివేపాకును నమలడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. పొట్ట కొవ్వు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories