Cholesterol: డైట్‌లో ఇవి చేర్చుకోండి.. కొలస్ట్రాల్‌ని తగ్గించుకోండి..

It is Very Difficult to Curb Cholesterol if These Foods are not Taken in the Daily Diet
x

Cholesterol: డైట్‌లో ఇవి చేర్చుకోండి.. కొలస్ట్రాల్‌ని తగ్గించుకోండి..

Highlights

Cholesterol: నేటి కాలంలో జీవనశైలి గజిబిజిగా మారడం వల్ల ప్రతి ఒక్కరు అధిక కొలస్ట్రాల్‌తో బాధపడుతున్నారు.

Cholesterol: నేటి కాలంలో జీవనశైలి గజిబిజిగా మారడం వల్ల ప్రతి ఒక్కరు అధిక కొలస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. దీనివల్ల గుండెపోటు, మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితిలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. జీవనశైలిలో స్వల్ప మార్పులు, కొన్ని ఇంటి చిట్కాలతో కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

అవిసె గింజల పొడి

అవిసె గింజల్లో లినోలెనిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఈ పొడిని వేడినీళ్లతో లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. దీని రెగ్యులర్ వినియోగంతో మీ జీర్ణవ్యవస్థ, గుండె రెండూ ఫిట్‌గా ఉంటాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి ప్రతి ఇంటి వంటగదిలో ఉంటుంది. దీని ఆయుర్వేద గుణాలు అద్భుతమైనవి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి పనిచేసే అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు, జీర్ణక్రియ ప్రక్రియ చక్కగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ వెల్లుల్లిని తొక్కతో నమలవచ్చు లేదా వెల్లుల్లి టీ తాగవచ్చు.

నిమ్మరసం

నిమ్మకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను తొలగించడానికి పనిచేస్తుంది. నిమ్మకాయను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని వినియోగం కారణంగా చెడు కొలెస్ట్రాల్ శరీరం నుంచి బయటకు వెళుతుంది.

వాల్ నట్స్

వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా-3, ఫైబర్, కాపర్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. రోజూ ఉదయం 4 వాల్‌నట్స్‌ తింటే సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరగడం ప్రారంభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాల్‌నట్‌లను తినడం వల్ల మనిషి ఎప్పుడూ ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories