ఒత్తిడికి లోనైతే మంచిదే.. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు..!

It is Good if you are under stress it increases immunity in the body
x

ఒత్తిడికి లోనైతే మంచిదే.. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు..!

Highlights

*ఒత్తిడికి లోనైతే మంచిదే.. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు..!

Health Tips: సాధారణంగా టెన్షన్‌కి గురికావడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పని చేసేటప్పుడు ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడికి గురికాని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అయితే చిన్నపాటి ఒత్తిడికి గురికావడం మంచిదే అని ఒక పరిశోధనలో తేలింది. ఇది మనస్సును యవ్వనంగా ఉంచుతుంది. ఇది మాత్రమే కాదు వృద్ధాప్యాన్ని దగ్గరిరి రానివ్వదు. న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడితో కలిసి ఫిర్దౌస్ దభార్ అనే అమెరికన్ సైకియాట్రిస్ట్ దీనిపై అధ్యయనం చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఒత్తిడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది

చిన్నపాటి ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థపై పాజిటివ్‌ ప్రభావాన్ని చూపుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆధునిక ప్రపంచంలో చిన్న చిన్న ఉద్రిక్తతలు ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక అథ్లెట్ రాబోయే రేసు గురించి కొంత టెన్షన్ కలిగి ఉండాలి. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది. తేలికపాటి శారీరక, మానసిక ఒత్తిడి రెండూ రక్తంలో ఇంటర్‌లుకిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మెదడు వయస్సు తక్కువ

తాజా పరిశోధన ప్రకారం 40 ఏళ్ల తర్వాత ఒక దశాబ్దంలో మెదడు పరిమాణం దాదాపు 5 శాతం చొప్పున తగ్గుతుంది. 70 ఏళ్ల తర్వాత క్షీణత రేటు మరింత పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పెద్దలలో మెదడు సంకోచం 4 సంవత్సరాలు తగ్గుతుంది. 2013 సంవత్సరం పరిశోధన ప్రకారం కొద్దిగా ఒత్తిడిని తీసుకోవడం వల్ల శరీరంలో కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నేర్చుకోవడం సులభం చేస్తుంది. తక్కువ ఒత్తిడి శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది. ఇది DNA, RNA లను రక్షిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories