రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రించడం ప్రమాదకరం.. ఈ వ్యాధుల బారిన పడే అవకాశం..!

It is Dangerous to Sleep Wearing a Sweater at Night
x

రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రించడం ప్రమాదకరం.. ఈ వ్యాధుల బారిన పడే అవకాశం..!

Highlights

Health Tips: రోజు రోజుకి చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ఎండలో ఉంటూ కొంచెం సేదతీరినా రాత్రిపూట మాత్రం చాలా కష్టంగా ఉంటోంది.

Health Tips: రోజు రోజుకి చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ఎండలో ఉంటూ కొంచెం సేదతీరినా రాత్రిపూట మాత్రం చాలా కష్టంగా ఉంటోంది. పెరిగిన చలిని తట్టుకునేందుకు చాలామంది స్వెటర్ ధరించి నిద్రిస్తున్నారు. ఈ ట్రిక్ వల్ల కొంచెం వెచ్చగా ఉన్నప్పటికీ అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట స్వెటర్ వేసుకుని ఎందుకు నిద్రించకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోవడం వల్ల పగటిపూట శరీరాన్ని వెచ్చగా ఉంచుకోలేరు. కాబట్టి రాత్రిపూట స్వెటర్‌ని తీసి మందపాటి దుప్పటి లేదా మెత్తని బొంత కప్పుకొని పడుకోవడం మంచిది. వెచ్చని దుస్తులు ధరించి నిద్రించాలనుకుంటే ముందుగా చర్మం సున్నితమైన భాగాలపై మాయిశ్చరైజర్ క్రీమ్‌ను రాసుకోవాలి. తర్వాత తేలికపాటి వెచ్చని దుస్తులు ధరించవచ్చు.

రక్తపోటు పెరుగుతుంది

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట స్వెటర్లు లేదా వెచ్చని దుస్తులు ధరించి నిద్రించడం వల్ల రక్తపోటు చాలా రెట్లు పెరుగుతుంది. చాలా సమయం ఇదే స్థితిలో ఉంటే శ్వాస, చెమట సమస్య మొదలవుతుంది. కాబట్టి రాత్రిపూట సాధారణ దుస్తులు ధరించి నిద్రించడానికి ప్రయత్నించాలి.

గాలి ప్రసరణ తగ్గుతుంది

ఫిట్‌గా ఉండాలంటే శరీరానికి క్రమం తప్పకుండా గాలి అవసరం. రాత్రిపూట వెచ్చని దుస్తులు ధరించడం వల్ల శరీరానికి సరైన గాలి అందదు. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి.

దురద సమస్య

వైద్యుల ప్రకారం రాత్రిపూట స్వెటర్లు, ఇతర వెచ్చని దుస్తులు ధరించడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. దీని వల్ల దురద, తామర లాంటి సమస్య వస్తుంది. దీంతో పాటు చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories