Relationship Tips: మీ భర్తకు కోపమెక్కువా.. చిన్న విషయాలకు గొడవ పడుతున్నారా..!

Is your Husband Angry are you quarreling over small things Know these Things
x

Relationship Tips: మీ భర్తకు కోపమెక్కువా.. చిన్న విషయాలకు గొడవ పడుతున్నారా..!

Highlights

Aggressive Partner, Husband Angry, Save Relationship, Relationship Tips

Relationship Tips: భార్య భర్తల మధ్య గొడవలు సహజం. కానీ ప్రతిరోజు ఇవే గొడవలు జరగుతుంటే మాత్రం నరకం. నేటికాలంలో చాలా జంటలు ఎక్కువ రోజులు కలిసి జీవించలేకపోతున్నారు. తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కోపిష్టి భర్తను తట్టుకునే భార్యలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వీరు చిన్న చిన్న విషయాలకు కూడా వారిపై అరుస్తారు. ఇలాంటి వారిపట్ల ఎలా మెలగాలో ఈ రోజు తెలుసుకుందాం.

కోపం ఎక్కువగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మహిళకు నిత్యం నరకమే. పురుషులు సాధారణంగా తక్కవు ఓపికను కలిగి ఉంటారు. తొందరగా అగ్రెసివ్‌ అవుతారు. కోపం ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు శారీరక హింసను కూడా భరించవలసి ఉంటుంది. అయితే సమాజ భయం, కుటుంబం నుంచి ఒత్తిడి కారణంగా చాలా మంది మహిళలు తమ భర్తల చెడు ప్రవర్తనను అంగీకరిస్తున్నారు.

మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి

భర్త కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. దీనివల్ల భార్యాభర్తల బంధం చెడిపోకుండా ఉంటుంది. అన్నిసార్లు ఇలా చేయడం కొంచెం కష్టమే. కానీ బంధం కొనసాగాలంటే కొన్నిసార్లు ఇలా చేయక తప్పదు.

కోపాన్ని కోపంతో జయించడం కష్టం

మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా అతడిపై కోపాన్ని ప్రదర్శిస్తే ఆ బంధం నిలవదు. తొందరగా విడాకులు తీసుకుంటారు. భార్యా భర్తల్లో ఎవరో ఒకరు శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒకరినొకరు కోపంతో తిట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఎక్కువకాలం కొనసాగలేరు.

లిమిట్స్‌ పెట్టుకోవడం అవసరం

భార్యభర్తలు వారి వారి లిమిట్‌లో ఉండాలి. ఏదైనా మితిమీరితే చెడు మాత్రమే జరుగుతుంది. ఎవ్వరైనా ఎంత భరిస్తారో అంతవరకే ఓపికపడుతారు. అలాగే భార్యభర్తలు కూడా ఒక లిమిట్‌ వరకు పోట్లాడుకోవడం ఓకె కానీ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగితే విడిపోవడమే దానిక పరిష్కారం అవుతుంది.

అవమానాలు సహించవద్దు

చాలామంది భర్తలు కోపంతో వారు చేసే చెడును కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వారు మీపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. అవమానిస్తారు. అవసరమైతే కొడుతారు. ఇలాంటివి ఏ మహిళ భరించకూడదు. ఒకవేళ మీరు అలాగే ఉంటే భవిష్యత్‌లో మీకు అన్ని చీకటి రోజులే అని గుర్తుంచుకోండి. ఇలాంటి వారి దగ్గరి నుంచి ఎంత తొందరగా విడిపోతే అంత మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories