Corona: ఏసీలో, కూలర్ లో కరోనా వైరస్ దాక్కుంటుందా?

Is It Risky to use Ac and Coolers in Pandemic Times
x

Representational image 

Highlights

Corona: ఏసీ, కూలర్ లో వైరస్ ఉంటుందనే భయంతో.. అవి ఆన్ చేయొద్దని వాదిస్తున్నారు.

Corona: హేయ్... ఏసీ ఆన్ చేయకండి.. కూలర్ పెట్టకండి అనే అరుపులు ఇప్పుడు కొన్ని ఇళ్లలో వినపడుతున్నాయి. ఎండాకాలం.. ఆ పై ఉక్కబోత.. ఏసీ పెట్టుకుని కూడా ఆన్ చేయకుండా ఎలా ఉండగలరు? కాని ఉండాలని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే? ఏసీ, కూలర్ ఆన్ చేస్తే కరోనా వస్తుంది.. కరోనా వచ్చాక ఏమవుతుందో వేరే చెప్పనక్కర్లేదుగా అంటూ బెదిరిస్తున్నారు. అసలు ఏసీలు, కూలర్లు ఆన్ చేస్తే కరోనా వస్తుందా? నిజమేనా? మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

కరోనా వైరస్ ఎక్కడెక్కడ దాక్కుంటుంది.. ఎక్కడ ఎంతసేపు బతికి ఉంటుందనే దానిపై మొదట్లో కొన్ని అంచనాలు వెలువడ్డాయి. వాటిలో ఒకటి ఏసీ లేదా కూలర్ లో వైరస్ స్థావరం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే అంచనా. గాలిలో అంత సేపు .. నీటిలో కాసేపు.. వేడిగా ఉంటే బతకదని ఇలా రకరకాలుగా చెప్పారు. కాని తర్వాత వాటిలో ఏవి నిజమో.. అబద్ధమో తెలియని పరిస్ధితి వచ్చింది. ఏసీ, కూలర్ సంగతి కూడా అంతే.

కాని మొదట్లో చెప్పింది గుర్తు పెట్టేసుకుని.. ఏసీ, కూలర్ లో వైరస్ ఉంటుందనే భయంతో.. అవి ఆన్ చేయొద్దని వాదిస్తున్నారు. కాని ఇది కరెక్టు కాదు. ఏసీ రూముకు సరైన వెంటిలేషన్.. ఏసీ ఆన్ లో లేనప్పుడు కాస్త కిటీకీలు అవి తెరిచి ఉంచడం. అంటే ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేలా చూసుకుంటే చాలు.. ఏసీ అయినా.. కూలర్ అయినా ఆన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. కరోనా పేషెంట్లు ఇంట్లో ఉంటే.. వారిని వేరే రూములో ఐసోలేషన్ లో ఉంచితే చాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories