Egg Yolk: గుడ్డులోని పచ్చసొన మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Is Egg Yolk Good Know Experts Answer
x

గుడ్డులోని పచ్చసొన మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Highlights

* ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి.

Egg Yolk: గుడ్డు ఒక సూపర్ ఫుడ్. ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. గుడ్డులో ఉండే ప్రోటీన్ పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువ ఆహారం తినాలనే కోరికని అదుపులో ఉంచుతుంది. ప్రజలు అనేక రకాలుగా గుడ్లు తింటారు. బరువు తగ్గేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. అయితే బరువు పెరగడానికి గుడ్డులోని పచ్చసొన తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీని గురించి తెలుసుకుందాం. వైద్యుల ప్రకారం.. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండూ వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటి లక్షణాలు దాదాపు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. కోడిగుడ్డులోని తెల్లసొన మాదిరిగానే కోడిగుడ్డు పచ్చసొన కూడా ఆరోగ్యకరమే అంటున్నారు. ఇందులో విటమిన్లు A,E,Kఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లం, ఒమేగా -3 ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గుడ్డు పచ్చసొనలో సెలీనియం

సెలీనియం ఒక పోషకం. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు రోగనిరోధక వ్యవస్థని బలంగా చేస్తుంది. ఇది కాకుండా థైరాయిడ్ ఆరోగ్యాన్ని సెలీనియం మెయింటెన్ చేస్తుంది. శరీరంలో దీని లోపం ఉన్నట్లయితే వికారం, వాంతులు, తలనొప్పి ఏర్పడుతాయి. ఒక గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు, 0.61 కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డులోని పసుపు భాగాన్ని తింటే ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు.

Show Full Article
Print Article
Next Story
More Stories