Tea: టీ తాగితే దంతాలు పసుపు రంగులోకి మారుతాయా..? నివారణ ఎలా..?

Benefits of Tea | Side Effects of Drinking Tea with Milk
x

టీ తాగితే దంతాలు పసుపు రంగులోకి మారుతాయా..? 

Highlights

* "నిద్రవచ్చేస్తోంది.. టీ తాగుదాం. తలనొప్పి, కొంచెం టీ తాగండి", ఇలాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం.

Benefits of Tea: "నిద్రవచ్చేస్తోంది.. టీ తాగుదాం. తలనొప్పి, కొంచెం టీ తాగండి", ఇలాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం.ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పానీయం టీ. కానీ టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. అయితే, పాలతో కలిపి చేసిన టీ వలన ఈ ప్రమాదం ఉండదు. అల్బెర్టా స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎవా చౌ, టీతో కలిపి పాలు తాగడం దంతాల మరకలను శుభ్రం చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెంటల్ హైజీన్‌లో ప్రచురించారు.

మనిషి తీసిన దంతాలను మిల్క్ టీ.. మిల్క్ కాని టీలో 24 గంటల పాటు ఉంచి, వాటి రంగును తనిఖీ చేశారు. మిల్కీ టీలో ఉంచిన దంతాల మెరుపు పెరిగింది. చౌ, సహోద్యోగుల పరిశోధనలో బ్లాక్ టీ వలన పళ్లపై మరకలు పడుతున్నాయని కనుగొన్నారు.

ఇదంతా పాలలో ఉండే ప్రత్యేక ప్రోటీన్ వల్ల. ఈ ప్రోటీన్ దంతాలను పసుపు మరకల నుండి రక్షిస్తుంది. దంతాలను మరింత మెరిసేలా చేస్తుంది. టీతో పాలు కలపడానికి ఇతర కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. దంతాలు మెరిసే టూత్‌పేస్ట్ కంటే ఇది మరింత ప్రభావవంతమైనది.

టీ తాగడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అతిగా టీని సేవించడం వల్ల అన్ని అనర్ధాలు ఉంటాయి. రోజుకు రెండు లేదా మూడు కప్పుల టీ ఫర్వాలేదు. కానీ, అంతకు మించి తాగితే ఇది జీర్నవ్యవస్తపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే, దీని వలన నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. మన అనారోగ్యానికి ఈ రెండూ పెద్ద కారణాలే. నిద్రలేమి వలన అల్జీమర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల టీ అంటే ఎంత ఇష్టం ఉన్నా రోజుకు రెండు లేదా మూడు కప్పుల కంటె ఎక్కువ తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories