Health Tips: కొవ్వు కరగాలంటే ఈ నాలుగు ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Include These Four Foods in Your Diet Burn Fat
x

Health Tips: కొవ్వు కరగాలంటే ఈ నాలుగు ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Highlights

Health Tips: కొవ్వు కరగాలంటే ఈ నాలుగు ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: కరోనావైరస్ వల్ల ఉద్యోగులందరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల చాలా బరువు పెరుగుతున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోవడం అంటే చాలా కష్టమైన పని. దీని కోసం డైలీ వర్కట్స్‌, హెల్తీ డైట్ పాటించాలి. అయితే కొన్ని రకాల ఆహరాలు తినడం వల్ల కడుపు, నడుము చుట్టు ఉన్న కొవ్వు కరిగించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. యాపిల్

యాపిల్ చాలా ఆరోగ్యకరమైన పండు. రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని తరచుగా వింటుంటాం. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గడానికి ఇది గొప్ప ఎంపిక.

2. పుట్టగొడుగులు

పుట్టగొడుగులు ఖరీదైన ఆహారం కావచ్చు. కానీ వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. పుట్టగొడుగులను తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

3. క్యారెట్లు

మీరు శరీర బరువును వేగంగా తగ్గించుకోవాలనుకుంటే క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇది తక్కువ కేలరీల ఆహారం.

4. పాప్‌కార్న్

మీరు ఎప్పుడో ఒకసారి ఇంట్లో లేదా సినిమా హాల్‌లో పాప్‌కార్న్ తినే ఉంటారు. ఇది ఫైబర్‌కి గొప్ప మూలం. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఇంట్లో తక్కువ నూనెలో పాప్‌కార్న్‌ను తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో చాలా సార్లు సంతృప్త కొవ్వు ఉండే నూనె వాడుతారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories