Health Tips: జుట్టు బలంగా పెరగాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌లో ఉండాలి.. అవేంటంటే..?

Include These Foods in Your Diet for Healthy and Strong Hair
x

Health Tips: జుట్టు బలంగా పెరగాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌లో ఉండాలి.. అవేంటంటే..?

Highlights

Health Tips: ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు తరచుగా బలహీనంగా మారుతుంది.

Health Tips: ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు తరచుగా బలహీనంగా మారుతుంది. దీంతో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతేకాదు తలలో చుండ్రు సమస్య తయారవుతుంది. ఈ పరిస్థితిలో జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారంలో కొన్ని సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోవాలి. ఇవి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. జుట్టు నిగనిగలాడేలా చేస్తాయి. ఈ సూపర్‌ఫుడ్‌లు జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

ఆకు కూరలు

ఐరన్ లోపం వల్ల జుట్టు వేగంగా రాలుతుంది. ఈ పరిస్థితిలో మీరు ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలను డైట్‌లో చేర్చుకోవాలి. బచ్చలికూర, బ్రోకలీ మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత ఉండదు. ఇది జుట్టును దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు వేగంగా పెరగడానికి సహకరిస్తాయి.

పుల్లటి పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు ఆహారంలో నారింజ, నిమ్మకాయలను చేర్చుకోవచ్చు. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

డ్రై ఫ్రూట్స్‌

డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణని అందిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడతాయి. బాదం, వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి రుచిగా కూడా ఉంటాయి.

అవకాడో

అవకాడోలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి పనిచేస్తుంది. మీరు అవోకాడోను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది.

బీన్స్

బీన్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. బీన్స్‌ను సలాడ్‌లు, సూప్‌లలో ఉపయోగించవచ్చు. బీన్స్ జుట్టును లోతుగా పోషించడానికి పని చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories