Memory Power Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు ఇవే.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Include these foods in your Childs Diet Memory will Improve
x

Memory Power Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు ఇవే.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Highlights

Memory Power Foods: పిల్లలకి ప్రతిరోజు పోషకాహారం అందివ్వాలి. లేదంటే వారి ఎదుగుదల కుంటుపడుతుంది.

Memory Power Foods: పిల్లలకి ప్రతిరోజు పోషకాహారం అందివ్వాలి. లేదంటే వారి ఎదుగుదల కుంటుపడుతుంది. తల్లిదండ్రులుగా వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా ముఖ్యం.పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా వారి ఎదుగుదలకి కూడా సహాయపడుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల రాకుండా కాపాడుతాయి. అయితే పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియాతో పాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ప్రోటీన్‌తో పాటు బి12, జింక్, సెలీనియం, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మెదడుకి పదును పెడుతాయి. దీనివల్ల మైండ్‌ షార్ప్‌గా తయారవుతుంది.

పచ్చని ఆకు కూరలు

బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు పిల్లల డైట్‌లో ఉండాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో విటమిన్లు ఇ, కె, ఫోలేట్, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. కూరగాయలను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలకు ఆకు కూరల నుంచి ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసి వడ్డించవచ్చు.

కాయధాన్యాలు

కాయధాన్యాలు, బీన్స్‌లో జింక్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

తృణధాన్యాలు

తృణధాన్యాలలో జొన్న, మిల్లెట్, బ్రౌన్ రైస్, వోట్మీల్, మొక్కజొన్న వంటివి ఉంటాయి. వీటిలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ఇవి మెదడు అభివృద్ధికి ఎంతోగానో తోడ్పడుతాయి.

డ్రైఫ్రూట్స్‌

పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్, విత్తనాలు కూడా చేర్చాలి. వీటిలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడానికి పని చేస్తాయి.

అరటిపండు

అరటిపండులో ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలకు అరటిపండు స్మూతీని కూడా చేసి ఇవ్వొచ్చు. ప్రతిరోజు పిల్లలకి అరటిపండు పెట్టొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories