Health Tips: ఒంట్లో కొలస్ట్రాల్‌ పెరిగిందా.. వీటిని డైట్‌లో చేర్చుకోండి..!

Include These Foods In The Diet When Cholesterol Is High In The Body
x

Health Tips: ఒంట్లో కొలస్ట్రాల్‌ పెరిగిందా.. వీటిని డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

Health Tips:ఒంట్లో కొలస్ట్రాల్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నేటి కాలంలో ఇది చాలా ప్రమాదకరమైనది.

Health Tips: ఒంట్లో కొలస్ట్రాల్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నేటి కాలంలో ఇది చాలా ప్రమాదకరమైనది. శారీరక శ్రమ తగ్గడంతో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పండగ సీజన్‌ కాబట్టి తీపి పదార్థాలు, మాంసాహారాలు ఎక్కువగా తినేవారు ఉంటారు. కొన్నిరోజులకు ఇవన్నీ గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. ఒకవేళ మీరు ఇప్పటికే అధిక కొలస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు డైట్‌లో కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అవిసె గింజలు

అవిసె గింజలు ఆరోగ్యానికి ఔషధం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే వీటిలో అనేక పోషక గుణాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, పౌడర్ మొదలైన వాటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

ఓట్స్ తినడం

ఓట్స్ అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే రోజూ ఓట్స్ తినడం ప్రారంభించాలి. దీన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ప్రతిరోజు దీనిని ఆహారంలో చేర్చుకోండి.

ఆకుకూరలు

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఎక్కువ శాతం ఫైబర్‌ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరని తీసుకోవాలి. బచ్చలికూర, పాలకూరలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తాయి. అందుకే ఈ రోజు నుంచే ఆకుకూరలను డైట్‌లో చేర్చుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories