Summer Fruits: సమ్మర్‌లో ఈ 5 పండ్లు బెస్ట్‌.. తింటే ఫిట్‌గా తయారవుతారు..!

Include These 5 Fruits in Your Diet in Summer Will Make you Fit
x

Summer Fruits: సమ్మర్‌లో ఈ 5 పండ్లు బెస్ట్‌.. తింటే ఫిట్‌గా తయారవుతారు..!

Highlights

Summer Fruits: ఆరోగ్యంగా ఉండటానికి ఎల్లప్పుడూ ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

Summer Fruits: ఆరోగ్యంగా ఉండటానికి ఎల్లప్పుడూ ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఈ పండ్లు, కూరగాయలలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గ్రీన్ ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, హైబీపీ అదుపులో ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. పచ్చి పండ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. మీరు వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు పండ్లని తప్పకుండా తినండి.

1. ద్రాక్ష

ద్రాక్ష ఆరోగ్యానికి వరం కంటే తక్కువేమి కాదు. ఇందులో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పొటాషియం, కాల్షియం, విటమిన్లు ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటి వాడకం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ద్రాక్ష తినడం వల్ల శరీరంలోకి శక్తిని వెంటనే ప్రసారం చేస్తుంది. ఇది వేసవిలో అలసట సమస్యను దూరం చేస్తుంది.

2. జామపండు

మీరు ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే దాని నుంచి బయటపడాలనుకుంటే జామపండు తినాలి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కండరాలను బలపరుస్తుంది. ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్-ఎ, సి, ఫోలేట్, జింక్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

3. గ్రీన్ యాపిల్స్

వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ గ్రీన్ యాపిల్స్ తింటే చాలా మంచిది. ఇందులో ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే గ్రీన్ యాపిల్స్‌లో 'క్వెర్సెటిన్' పుష్కలంగా లభిస్తుంది. ఈ రసాయనం సహాయంతో మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

4. పుచ్చకాయ

మీరు వేసవిలో చల్లగా ఉండాలంటే పుచ్చకాయను ఖచ్చితంగా తినండి. ఇందులో పొట్టను చల్లబరిచే గుణాలు ఉంటాయి. దీని వల్ల వేసవిలో శరీరంలో నీటి కొరత ఉండదు. పుచ్చకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే దీని రసాన్ని కూడా తాగవచ్చు.

5. కివి పండు

కివిపండులో విటమిన్-సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్‌టెన్సివ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్లను పెంచడంలో సహాయపడతాయి. కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే డయాబెటిక్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories