Weight Loss Diet: 50 ఏళ్ల వయసులో పొట్ట తగ్గాలంటే ఈ డైట్‌ ఫాలో కావాల్సిందే..!

If you Want to Lose Weight at the Age of 50 you Need to Follow This Diet
x

Weight Loss Diet: 50 ఏళ్ల వయసులో పొట్ట తగ్గాలంటే ఈ డైట్‌ ఫాలో కావాల్సిందే..!

Highlights

Weight Loss Diet: పెరుగుతున్న వయస్సుతో పాటు ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తారు.

Weight Loss Diet: పెరుగుతున్న వయస్సుతో పాటు ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆలోచిస్తారు. ఫిట్‌గా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ 40 నుంచి 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వ్యాయామం చేయలేరు. త్వరగా అలసిపోతారు. ఈ పరిస్థితుల్లో చాలా మందికి పొట్ట బయటకు వచ్చి శరీరం విస్తరిస్తుంది. దీనినే ఫ్యాట్ అని పిలుస్తారు. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది తరువాత గుండె, రక్తపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి 40 నుంచి 50 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ఫిట్‌గా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

1. అల్పాహారం

అల్పాహారం సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు అందులో ఫైబర్ పుష్కలంగా ఉండాలి. ఇది సులువుగా జీర్ణమవుతుంది. కాబట్టి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దక సమస్య ఉండదు. మీరు మీ ఆహారంలో గంజి లేదా ఖిచ్డీని తినవచ్చు. గింజలు లేదా ఫైబర్ ఆహారాలను తీసుకోవచ్చు.

2. మధ్యాహ్న భోజనం

మధ్యాహ్న భోజనంలో మంచి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. ఈ పరిస్థితిలో మీరు లేత పప్పు కూర తీసుకోవచ్చు. అలాగే పండు లేదా దాని రసం కూడా తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వారు సుమారు 100 గ్రాములు. చికెన్ తినవచ్చు. ఇలా చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.

3. స్నాక్స్

చాలా మంది వ్యక్తులు సాయంత్రం స్నాక్స్‌లో స్పైసీగా ఏదైనా తినడానికి ఇష్టపడతారు. ఈ పరిస్థితిలో మీరు తక్కువ చక్కెర ఉన్న మిల్క్ టీని తాగవచ్చు. లేదా గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీంతో పాటు మొలకలు కూడా తినవచ్చు. ఇవన్నీ శరీరంలోని కొవ్వును తగ్గించడానికి పని చేస్తాయి.

4. రాత్రి భోజనం

తరచుగా చాలామంది రాత్రిపూట ఆరోగ్యానికి హాని కలిగించే భారీ ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి ఎల్లప్పుడూ రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలి. ఇందులో ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్నం, పప్పు, కూరగాయలు, రోటీలు తీసుకోవచ్చు. మీరు ఈ ఆహారం, పానీయాలన్నింటినీ జాగ్రత్తగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories