Grow Thick Hair: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ బెస్ట్‌.. అవేంటంటే..?

If you want to Grow Thick Hair Add These Superfoods to the Best Diet you will Get Good Results
x

Grow Thick Hair: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ బెస్ట్‌.. అవేంటంటే..?

Highlights

Grow Thick Hair: నేటి రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలని ఎదుర్కొంటున్నారు. కొంతమందికి తలపై జుట్టు పలుచబడటంతో పెళ్లికూడా కావడం లేదు.

Grow Thick Hair: నేటి రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలని ఎదుర్కొంటున్నారు. కొంతమందికి తలపై జుట్టు పలుచబడటంతో పెళ్లికూడా కావడం లేదు. బట్టతల వస్తుందేమో అని బయటికి కూడా రావడం లేదు. దీనికి కారణం చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం అని చెప్పవచ్చ. ఇలాంటి పరిస్థితుల్లో దిగులుచెందుకుండా ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు ఏది తిన్నా అది ఆరోగ్యం, చర్మం, జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరిగేలా చేసుకోవచ్చు. అలాంటి సూపర్‌ఫుడ్స్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

నేరేడు

నేరేడు పండులో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను డ్యామేజ్, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా ప్రోటీన్ కొల్లాజెన్‌గా పనిచేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్‌లో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, బయోటిన్, విటమిన్ బి7 గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు, శరీరం వాపుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

చియా విత్తనాలు

చియా గింజలు తక్కువ కేలరీలని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు. ఈ విత్తనాలను స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

బచ్చలికూర

బచ్చలికూరలో విటమిన్ ఎ, సి, ఐరన్, ప్రొటీన్, ఫోలేట్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కొన్నిసార్లు శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాబట్టి బచ్చలికూర తినడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఒత్తుగా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories