Health Tips: ఫిట్‌ బాడీ కావాలంటే ప్రతిరోజు ఇవి తినాల్సిందే.. ధర కూడా తక్కువే..!

If you Want to Become Fit or Lose weight easily you Should eat Chickpeas Every Day
x

Health Tips: ఫిట్‌ బాడీ కావాలంటే ప్రతిరోజు ఇవి తినాల్సిందే.. ధర కూడా తక్కువే..!

Highlights

Health Tips: ఫిట్‌ బాడీ కావాలంటే ప్రతిరోజు ఇవి తినాల్సిందే.. ధర కూడా తక్కువే..!

Health Tips: బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజు శెనగలు తీసుకోవడం ఉత్తమం. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్‌తో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతాయి. శెనగల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

శెనగలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి పొట్టలోని కొవ్వును తగ్గించడానికి శరీరాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. దీంతోపాటు రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని తీరుస్తాయి. నిత్యం శెనగలు తినే వ్యక్తుల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఒక గ్రాము శెనగలు తినడం వల్ల హానికరమైన ట్రైగ్లిజరైడ్ శరీరం నుంచి మలం ద్వారా బయటకు వెళుతాయి.

శెనగలని రాత్రంతా ఒక పాత్రలో నానబెట్టి ఉదయం లేదా రోజులో ఎప్పుడైనా తినవచ్చు. మొలకెత్తిన శెనగ తింటే అది ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తుంది. కొందరు ఉల్లిపాయలు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటారు. ఇలా కాకుండా కాల్చిన శెనగలను చిరుతిండిగా తింటే స్థూలకాయం తగ్గుతుంది. అయితే ఎక్కువ నూనెలో ఉడికిన తర్వాత శెనగలని తినకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories