Smartphone Affect: స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వాడుతున్నారా.. కళ్లకి మాత్రమే కాదు వీటికి కూడా ఎఫెక్టే..!

If You Use the Smartphone a Lot it Affects not Only the Eyes but Also the Ears
x

Smartphone Affect: స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వాడుతున్నారా.. కళ్లకి మాత్రమే కాదు వీటికి కూడా ఎఫెక్టే..!

Highlights

Smartphone Affect: ఈ ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా బతకలేము.

Smartphone Affect: ఈ ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా బతకలేము. దీని వినియోగం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. చిన్నపిల్లలైనా, వృద్ధులైనా అందరికి నిత్యావసరంగా మారింది. ఇంతకుముందు వ్యాపారులు మాత్రమే వినియోగించేవారు కానీ నేడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తుంది. దీనివల్ల మంచి జరగడంతో పాటు చెడు కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు దీనివల్ల పలురకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొన్ని అధ్యయనాల ప్రకారం ఫోన్ వాడకం దాని రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం మనుషులతో పాటు జంతువులు, పక్షులకు కూడా ఉందని తేల్చారు. అయినప్పటికీ దీని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ కొత్తగా ప్రపంచంలోని కొంతమంది పరిశోధకులు ఫోన్‌లో మాట్లాడటానికి ఏ చెవిని ఉపయోగించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది ఫోన్ మాట్లాడేందుకు కుడి చెవిని ఉపయోగిస్తారు. అయితే ఇది సరైనదేనా అని చాలామందికి అనుమానం ఉంది.

పరిశోధనల ప్రకారం ఫోన్ మాట్లాడేటప్పుడు దాని నుంచి వెలువడే రేడియేషన్ మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఎడమ వైపు చెవిని ఉపయోగించాలి. అయితే ఫోన్ కాల్‌లకు ఎడమ లేదా కుడి చెవిని ఉపయోగించడం సురక్షితమని ఇప్పటి వరకు ఈ అధ్యయనం నిరూపించబడలేదు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు తగిన ఆధారాలు సేకరించలేదు.

మన శరీరంలోని కణాలు ఫోన్‌తో తాకినప్పుడు అది బ్లడ్-మెదడు పై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం దాదాపు 80 శాతం మంది ప్రజలు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కుడి చెవిని ఉపయోగిస్తారు. అయితే మన మెదడు ఎడమ భాగం మరింత చురుకుగా ఉంటుంది. కానీ ఫోన్ కాల్‌లో ఎక్కువసేపు మాట్లాడితే ఒక చెవి నుంచి మరొక చెవికి ఫోన్‌ను మారుస్తూ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories