Health Tips: ఈ పండ్లను తినడం ప్రారంభిస్తే ముఖంపై ముడతలు వారంలో మాయం..!

If You Start Eating These Fruits The Wrinkles On The Face Will Disappear Within A Week
x

Health Tips: ఈ పండ్లను తినడం ప్రారంభిస్తే ముఖంపై ముడతలు వారంలో మాయం..!

Highlights

Health Tips: నేటి రోజుల్లో కాలుష్యం, జీవన విధానంలో మార్పుల వల్ల చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి.

Health Tips: నేటి రోజుల్లో కాలుష్యం, జీవన విధానంలో మార్పుల వల్ల చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో సహజ సిద్దమైన పద్ధతుల ద్వారా ముడతలను తగ్గించుకోవచ్చు. డైట్‌లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. ఇవి ముఖంపై ముడతలను తొలగిస్తాయి. ఆ పండ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బొప్పాయి

బొప్పాయిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా బొప్పాయిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తాయి. ముఖం ముడుతలతో ఇబ్బంది పడుతుంటే రోజూ బొప్పాయిని తినండి.

బెర్రీస్‌

బెర్రీస్‌లో చర్మ కణాలను రిపేర్ చేసే అనేక లక్షణాలు ఉంటాయి. విటమిన్లు A, C అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పనిచేస్తాయి. అంతేకాకుండా కళ్లను సురక్షితంగా ఉంచుతాయి.

దానిమ్మ

దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాకండా చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీని చిన్న ఎర్రటి గింజలు ప్యూనికాలాజిన్స్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే కొల్లాజెన్‌ను పెంచుతాయి. చర్మం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

ఆరెంజ్

ఆరెంజ్ జుట్టు, చర్మం రెండింటికీ మేలు చేస్తుంది. చర్మం నిర్జీవంగా ఉంటే ప్రతిరోజూ నారింజ తినడం ప్రారంభించాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మచ్చ లేకుండా చేయడంలో సహాయపడుతుంది.

పైనాపిల్

పైనాపిల్ ఆరోగ్యానికి నిధి. ముఖంపై ముడతలు ఉన్నట్లయితే పైనాపిల్ తినడం ప్రారంభించండి. ఎందుకంటే చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడే అనేక విటమిన్లు ఇందులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories