Ice Cream History: ఐస్‌ క్రీం చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 2000 వేల సంవత్సరాల క్రితమే తయారీ..!

If you Know the History of ice cream you will be surprised It was made 2000 thousand years ago
x

Ice Cream History: ఐస్‌ క్రీం చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 2000 వేల సంవత్సరాల క్రితమే తయారీ..!

Highlights

Ice Cream History: ఐస్‌ క్రీం చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 2000 వేల సంవత్సరాల క్రితమే తయారీ..!

Ice Cream History: ఐస్‌ క్రీం అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడుతారు. అంతేకాదు వేసవిలో దీనికి మరింత డిమాండ్‌ ఉంటుంది. ఎక్కడ చూసిన ఐస్‌ క్రీం షాపులు రద్దీగా ఉంటాయి. అయితే ఇలాంటి రుచికరమైన ఐస్‌ క్రీం మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైందో ఎవరికైనా తెలుసా..? ఐస్‌ క్రీం చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఫ్రీజ్, ఐస్ తయారీ యంత్రాలు ఉనికిలో లేని సమయంలో ఐస్ క్రీం తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరానియన్లు 2000 సంవత్సరాల క్రితం ఐస్ క్రీం తయారు చేసినట్లు తేలింది. పర్షియా నివాసితులు ఐస్ క్రీం తయారీలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నారు. ఇరాన్‌లోని ఎడారి యాజ్ద్ ప్రాంతాలలో నేలమాళిగలు ఉండేవి. వీటిని ఎక్కువగా మంచు తయారీకి ఉపయోగించేవారు. ఈ సెల్లార్‌ల ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో కూడా ఇవి వేడిగా ఉండవు. సంవత్సరం మొత్తం ఇక్కడ మంచు నిల్వ ఉంటుంది.

ఇరానియన్లు ఫలూదాను ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్‌క్రీమ్ అని పిలుస్తారు. నిజానికి ఫలూదా అనేది పర్షియన్ పేరు. దీనిని సంప్రదాయ పద్దతిలో తయారుచేస్తారు. ఇరాన్‌లో ఐస్‌క్రీం తయారు చేసేందుకు ముందుగా పెద్ద కుండను తీసుకుని అందులో ఐస్‌ను వేసేవారు. తరువాత పాలు ఒక చిన్న పాత్రలో మరిగించి వాటిలో ఐస్ వేసి గడ్డకట్టేలా చేసేవారు. ఈ విధంగా ఐస్ క్రీం తయారు చేసేవారు. కానీ ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉంటుంది. ఇరానియన్ పద్ధతిని పాటించడం ద్వారా ఇటలీలో దీని వ్యాపారం ప్రారంభమైంది. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్‌క్రీం ఇరాన్‌లోనే తయారైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories