Health Tips: ఊరికే చెప్పరు వైద్యులు బీట్‌రూట్‌ తినాలని.. ఇవి తెలుసుకుంటే మీరే ఒప్పుకుంటారు..!

If you Know the Benefits of Eating Beetroot you will Definitely Include it in Your Diet
x

Health Tips: ఊరికే చెప్పరు వైద్యులు బీట్‌రూట్‌ తినాలని.. ఇవి తెలుసుకుంటే మీరే ఒప్పుకుంటారు..!

Highlights

Health Tips: బీట్‌రూట్ అద్బుత దుంప కూరగాయ.

Health Tips: బీట్‌రూట్ అద్బుత దుంప కూరగాయ. దీనిని భూగర్భంలో పండిస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీట్‌రూట్‌ను అనేక విధాలుగా తీసుకోవచ్చు. కూరలు, సలాడ్‌, జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. చాలా మందికి దీని రుచి నచ్చదు కానీ పోషక విలువలు తెలిస్తే కచ్చితంగా వదిలిపెట్టరు. ఈరోజు బీట్‌రూట్‌ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బీట్‌రూట్‌లో లభించే పోషకాలు

బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్‌లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. మీరు 10 గ్రాముల బీట్‌రూట్ తింటే 43 మిల్లీగ్రాముల కేలరీలు, 2 గ్రాముల కొవ్వు లభిస్తుంది. అంటే శరీర బరువు పెరగదు. ఇది శరీర అభివృద్ధిక కావాల్సిన ముఖ్యమైన ప్రొటీన్లని కలిగి ఉంటుంది.

బీట్‌రూట్ తినడం వల్ల కలిగే లాభాలు

బీట్‌రూట్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో లెక్కించడం చాలా కష్టం. బీట్‌రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనలను రక్షిస్తుంది. ముఖ్యంగా దీని రసం, సలాడ్‌లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెప్పవచ్చు. తరచుగా మలబద్ధకం, కడుపు సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా బీట్‌రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉంటే బీట్‌రూట్ సలాడ్ లేదా జ్యూస్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బీపీ అదుపులో ఉంటుంది. తరచుగా అలసట లేదా బలహీనత ఉంటే బీట్‌రూట్ దివ్యౌషధంగా చెప్పవచ్చు. బీట్‌రూట్ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. బీట్‌రూట్ మన అందానికి చాలా ముఖ్యమైనది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముఖంపై అద్భుతమైన గ్లో తెస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories