Curd Garlic Chutney: పెరుగు-వెల్లుల్లి చట్నీతో ఈ వ్యాధికి చెక్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

If you Know the Benefits of Checking Uric Acid with Curd-Garlic Chutney You Wont Give Up at all
x

Curd Garlic Chutney: పెరుగు-వెల్లుల్లి చట్నీతో ఈ వ్యాధికి చెక్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Highlights

Curd Garlic Chutney: పచ్చడి అనేది ఒక భారతీయ సంప్రదాయ వంటకం.

Curd Garlic Chutney: పచ్చడి అనేది ఒక భారతీయ సంప్రదాయ వంటకం. ఇది ఆహారానికి మరింత రుచిని అందిస్తుంది. దాదాపు అందరి ఇళ్లలో పచ్చళ్లు ఉంటాయి. ఇందులో సీజనల్‌ పచ్చళ్లు, అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్లు ఉంటాయి. ఈ రోజు పెరుగు-వెల్లుల్లి చట్నీ గురించి తెలుసుకుందాం. ఈ రెండింటి మిశ్రమం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు-వెల్లుల్లి చట్నీ రుచికరమైనది. పోషకమైనది కూడా. ఇది తయారు చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. కాబట్టి దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు

తాజా పెరుగు 2 కప్పులు

పచ్చి మిరపకాయలు 4-5

ఆవాలు ఒక చెంచా

కరివేపాకు 5-6

నూనె 2 చెంచాలు

ఉప్పు రుచికి సరిపడా

ఎర్ర మిరపకాయ పొడి 1 చెంచా

ఎలా తయారు చేయాలి?

పెరుగు-వెల్లుల్లి చట్నీ చేయడానికి ముందుగా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వాటిపై తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కడిగి కట్‌ చేయాలి. మిక్సీలో కడిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, పెరుగు వేసి బాగా మిక్స్‌ చేయాలి. తరువాత గిన్నెలో కొంచెం నూనె వేసి అందులో ఒక చెంచా ఆవాలు వేసి వేయించాలి.

తరువాత కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిక్సీలో రుబ్బిన మిశ్రమాన్ని నూనెగిన్నెలో వేసి బాగా కలపాలి. ఇందులో రుచి ప్రకారం ఉప్పు, ఎర్ర కారం వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన పెరుగు-వెల్లుల్లి చట్నీ రెడి అయిపోయినట్లే.

Show Full Article
Print Article
Next Story
More Stories