Diabetes: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు షుగర్ వచ్చినట్లే..!

if you Have These Symptoms in Your Body it is as if you have sugar
x

Diabetes: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు షుగర్ వచ్చినట్లే..!

Highlights

Diabetes: నేడు మధుమేహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా ఉద్భవించింది.

Diabetes: నేడు మధుమేహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా ఉద్భవించింది. ఇది జీవితంలో ఎప్పుడైనా రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో టైప్ 1, టైప్ 2 అనే రెండు రకాలు ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి దాని లక్షణాలను గుర్తించడం ముఖ్యం. వాటి గురించి తెలుసుకుందాం.

1. తరచుగా ఆకలి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. మీరు ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే మీ షుగర్‌ పరీక్ష చేయించుకోండి.

2. తీరని దాహం

మీ గొంతు పదే పదే పొడిగా మారితే నీరు తాగిన తర్వాత కూడా దాహం తీరకుంటే చాలా ప్రమాదం. ఈ పరిస్థితిలో మీరు షుగర్‌ లెవల్స్‌ని తనిఖీ చేయాలి.

3. తరచుగా మూత్ర విసర్జన

మీరు రాత్రిపూట నాలుగు లేదా ఐదు సార్లు మూత్ర విసర్జన చేయడానికి లేచినట్లయితే షుగర్ పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మధుమేహం పెద్ద లక్షణం.

4. బరువు తగ్గడం

బరువు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభిస్తే అది మధుమేహం లక్షణం కావచ్చు. కాబట్టి సమయానికి అప్రమత్తంగా ఉండటం అవసరం.

5. అలసిపోవడం

ఒకప్పుడు 10 నుంచి 12 గంటల పాటు అలసిపోకుండా పని చేసినవారు ఇప్పుడు 8 గంటల పని చేస్తే అలసిపోతున్నట్లు అనిపిస్తే షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సిందే.

30 ఏళ్లు దాటిన తర్వాత ఎప్పటికప్పుడు మధుమేహానికి చెక్ పెట్టడం అవసరం. మధుమేహం లక్షణాలు మీలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా టెస్ట్‌ చేయించుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే చాలా ప్రమాదంగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories