Uric Acid: యూరిక్ యాసిడ్‌ లక్షణాలుంటే ఈ ఆహారాలని అస్సలు తినకూడదు..!

If you Have Symptoms of Uric Acid you Should not eat These Foods at all
x

Uric Acid: యూరిక్ యాసిడ్‌ లక్షణాలుంటే ఈ ఆహారాలని అస్సలు తినకూడదు..!

Highlights

Uric Acid: మన శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే గౌట్ వ్యాధికి గురవుతాము.

Uric Acid: మన శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే గౌట్ వ్యాధికి గురవుతాము. విష పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లనప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్‌ స్థాయి పెరుగుతుంది. ఈ సమయంలో బీరు అస్సలు తాగకూడదు. ఇందులో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే దీనిని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.

కాలీఫ్లవర్ మానుకోండి

యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, పుట్టగొడుగులను తినకూడదు. ఎందుకంటే ఇందులో ప్యూరిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

ప్రోటీన్ ఫుడ్స్‌కి దూరం

కొన్ని వ్యాధులలో ప్రోటీన్ వంటి ఆహారాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్న రోగులకు ప్రోటీన్-రిచ్ ఫుడ్ హానికరం. ఉదాహరణకు పాలు, పెరుగు, కిడ్నీ బీన్స్, పచ్చి బఠానీలు, బచ్చలికూర, కాయధాన్యాలు మొదలైన వాటిని తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే ప్రొటీన్ ఫుడ్స్ లో 100 నుంచి 200 గ్రాముల ప్యూరిన్స్ ఉంటాయి.

అధిక చక్కెర పానీయాలు

వీటిలో అధిక చక్కెర ఆహారాలు, ప్యాకేజింగ్ పానీయాలు, సోడా, షికంజి మొదలైనవి ఉంటాయి. మీరు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ మొత్తాన్ని పెంచుతాయి. ఇది మీ సమస్యలను పెంచుతుంది. కాబట్టి వాటిని నివారించండి. అలాగే యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు రాత్రిపూట సాధారణ ఆహారాన్ని తినాలి. రాత్రిపూట పొట్టు తీసిన పప్పులు తినకూడదు. దీని కారణంగా యూరిక్ స్థాయి మరింత పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories