Regular Diet: రెగ్యూలర్ డైట్‌లో ఇవి తినండి.. మరణ ప్రమాదం నుంచి తప్పించుకోండి..!

If You Eat These In A Regular Diet The Risk Of Death Will Be Avoided
x

Regular Diet: రెగ్యూలర్ డైట్‌లో ఇవి తినండి.. మరణ ప్రమాదం నుంచి తప్పించుకోండి..!

Highlights

Regular Diet: జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల ప్రమాదం పెరిగింది.

Regular Diet: జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల ప్రమాదం పెరిగింది. సరైన ఆహార పద్దతులు పాటించకపోవడం వల్ల చాలామంది రకరకాల రోగాలకి గురవుతున్నారు. ముఖ్యంగా గుండెజబ్బుల కారణంగా చాలామంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు. వీటిని నివారించడానికి శాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల చైనాలోని చాంగ్షాలోని సెంట్రల్ సౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు రోజువారీ డైట్‌లో మార్పులు చేయడం వల్ల గుండె జబ్బుల మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో వారు ఆహార ప్రాముఖ్యతని వివరించారు. అధిక రక్తపోటు, గుండెపోటు మరణాలకి అనారోగ్యకరమైన ఆహారమే కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. వారు సూచించిన ప్రకారం చేపలు, పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు ప్రతిరోజు తీసుకోవాలి. చక్కెర పానీయాలు, అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.

ప్రతిరోజు ఎంత మోతాదులో తీసుకోవాలి..?

1. ప్రతిరోజూ సముద్రపు ఆహారం నుంచి 200 నుంచి 300 మిల్లీగ్రాముల ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకోవాలి.

2. ప్రతిరోజూ 200 నుంచి 300 గ్రాముల పండ్లు తినాలి.

3. ప్రతిరోజూ 290 నుంచి 430 గ్రాముల కూరగాయలు తినాలి.

4. రోజూ 16 నుంచి 25 గ్రాముల గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.

5. 100 నుంచి 150 గ్రాముల తృణధాన్యాలు తినడం లక్ష్యంగా పెట్టుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories