Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తింటే బరువు తగ్గుతారు.. అవేంటంటే..?

If you Eat these Foods in Breakfast You will lose Weight Know that
x

Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తింటే బరువు తగ్గుతారు.. అవేంటంటే..?

Highlights

Health Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తింటే బరువు తగ్గుతారు.. అవేంటంటే..?

Health Tips: భారతదేశంలో రుచికరమైన వంటకాలకు కొదవ లేదు. కానీ ఈ అభిరుచి చాలామందిని స్థూలకాయులుగా చేస్తుంది. పొట్ట, నడుము చుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోతుంది. తర్వాత దీనిని తగ్గించడం చాలా కష్టమవుతుంది. కొంత మంది బరువు తగ్గడానికి ఆహారం, పానీయాలు తగ్గించుకుంటారు. కానీ దీని వల్ల బలహీనతకి గురవుతారు. అయితే ఆహారాన్ని తగ్గించడానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ఉత్తమం. అల్పాహారంలో కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. వోట్స్

వోట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరుగుటను తగ్గించడంలో సహాయపడుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదం చేస్తాయి. రోజూ ఉదయాన్నే ఓట్స్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా బరువు మెయింటెయిన్ అవుతుంది.

2. మల్టీగ్రెయిన్ ఫ్లోర్ రోటీ

ఉదయం వైట్ బ్రెడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది బరువుని పెంచుతుంది. దీనికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండి ఉత్పత్తులు ఉన్నాయి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ లేదా రొట్టె ఆరోగ్యకరమైనవిగా చెప్పవచ్చు. ఇవి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. క్రమం తప్పకుండా తింటే ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉంటుంది.

3. ఇడ్లీ

ఇడ్లీ ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. దీనిని తినడం వల్ల బరువు పెరగరు. అంతేకాకుండా చాలా సమయం వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో ఎటువంటి ఆహారాలు తినకుండా ఉంటాం. ఇడ్లీలో ఫైబర్‌, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories