Health Tips: ఇలాంటి ఆహారాలు తింటే మతిమరుపు వస్తుంది.. అవేంటంటే..?

If You Eat Such Foods you Will get Forgetfulness Leave it Now
x

Health Tips: ఇలాంటి ఆహారాలు తింటే మతిమరుపు వస్తుంది.. అవేంటంటే..?

Highlights

Health Tips: మన ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలతో పాటు చెడు చేసే ఆహారాలు కూడా ఉన్నాయి.

Health Tips: మన ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలతో పాటు చెడు చేసే ఆహారాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల మతిమరుపు వస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఈ మెమరీ స్నాచింగ్ ఫుడ్ అలవాటు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి ఆహారాలకి దూరంగా ఉండటం ఉత్తమం. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

వాస్తవానికి బయటి ఆహారం ఎప్పుడు తినకూడదు. బర్గర్, చిప్స్ లాంటి ఆహారాలు మతిమరుపుకు కారణమవుతున్నాయి. వీటిని ప్రిజర్వేటివ్ ఫుడ్ అని పిలుస్తారు. బ్రిటన్‌లో ఈ రకమైన ప్రాసెస్డ్ ఫుడ్‌కు సంబంధించిన పరిశోధనలు జరిగాయి. దీని ప్రకారం ఈ ఆహారాలు తినడం వల్ల శరీరంలో 400 నుంచి 500 కేలరీలు అందుతాయి. ఈ పరిశోధన సుమారు 8 సంవత్సరాలు జరిగింది. ఇందులో 10775 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నారు.

బర్గర్లు, చిప్స్ జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం చూపుతుందని పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ రకమైన ఆహారాన్ని తినే వారిలో ఇతరులతో పోలిస్తే 28 శాతం ఎక్కువ మతిమరుపు రేటు ఉంటుంది. అయితే ఈ రకమైన ఆహారం ప్రజల రోజువారీ ఆహారంలో 50 శాతం ఉంటుంది. దీనివల్ల చాలామంది మతిమరుపుకి గురవుతున్నారు. ఈ రకమైన ఆహారం మాత్రమే కాకుండా వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, డ్రగ్స్ తీసుకోవడం వంటి సమస్యల వల్ల గుండెలో సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండాలంటే రోజూ వాకింగ్, హెల్తీ డైట్ రొటీన్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా మంచి నిద్రను పొందడం కూడా అవసరమే.

Show Full Article
Print Article
Next Story
More Stories