Mutton: మీరు మటన్ ఎక్కువగా తింటారా? డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందట..జాగ్రత్త

If you eat a lot of mutton, you will get type 2 diabetes Full details
x

 Mutton: మీరు మటన్ ఎక్కువగా తింటారా? డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందట..జాగ్రత్త

Highlights

Mutton:మీకు మాంసాహారం అంటే ఇష్టమా? చికెన్ కంటే మటన్ ఎక్కువగా ఇష్టంగా తింటారా. అయితే మీకో హెచ్చరిక. ఓ రీసెర్చ్ లో మటన్ ఎక్కువగా తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Mutton: చాలా మంది ఇళ్లలో వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ తినాల్సిందే. ఏదైనా ఫంక్షన్, పార్టీ జరిగినా అక్కడ కూడా ఎక్కువ మంది నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. అందులో ముఖ్యంగా మెజార్టీ ప్రజలు మటన్ తింటారు. మీరు కూడా మటన్ ఎక్కువగా తిన్నట్లయితే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ మధ్యే జరిగిన ఓ పరిశోధనలో మటన్ ఎక్కువగా తినేవారికి షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మటన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మటన్ పలు అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుందన్న సంగతి మీకు తెలసా. ముఖ్యంగా చాలా మంది తరచుగా మటన్ తింటుంటారు. వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటకు వచ్చింది.

ఈ పరిశోధనలో భాగంగా మటన్ తినే అలవాటు ఉన్న వారిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 10ఏండ్లుగా పరిశీలించారు. ఈ అధ్యయనం ద్వారా వారంలో రెండు మూడుసార్లు ఏదొక రూపంలో మటన్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ రావడానికి 15శాతం అవకాశం ఉందని తేలింది. ప్రధానంగా మటన్ లో హానికారిక శాచురేటెడ్ కొవ్వులు సహజ ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

అంతేకాదు ఇళ్లలోనే తయారు చేసేవాటితో పోలిస్తే పలు కంపెనీలు ప్రాసెస్ చేసి నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్ తినేవారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పారు. మటన్ కు బదులుగా మంచి కొవ్వులు, ప్రొటీన్ కోసం చేపలు తినడం మేలని సూచిస్తున్నారు. తరచుగా మటన్ తినేవారు జాగ్రత్తగా ఉండటం మంచిదని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ తెలిపారు. శరీరపుష్టికి మాంసాహారం అవసరమే కానీ..లిమిట్ గా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories