పరగడుపున ఈ జ్యూస్‌లు తాగితే పేగులో పేరుకుపోయిన చెత్త మొత్తం క్లీన్‌..!

If you Drink These Juices on an Empty Stomach the Accumulated Waste in the Intestine Will be Cleaned
x

పరగడుపున ఈ జ్యూస్‌లు తాగితే పేగులో పేరుకుపోయిన చెత్త మొత్తం క్లీన్‌..!

Highlights

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందులో లోపం ఏర్పడితే అది శరీరంలోని అనేక సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థ వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. పెద్దప్రేగు జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన భాగం. అయితే పెద్దపేగులో పేరుకుపోయిన చెత్త అనేక వ్యాధులకు కారణమవుతుంది. శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలని పాటించవచ్చు. కొన్ని జ్యూస్‌లు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి జీర్ణాశయానికి ఉపయోగకరంగా ఉంటాయి. పేగులను శుభ్రపరిచి శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చే ఆ జ్యూస్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

యాపిల్ జ్యూస్

యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని రసం కూడా పొట్టకి చాలా మేలు చేస్తుంది. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపులోని మురికి, విషపదార్థాలు మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

కూరగాయల జ్యూస్‌

కూరగాయల రసం కూడా ప్రేగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బచ్చలికూర, టొమాటో, క్యారెట్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, పొట్లకాయ రసాన్ని తప్పనిసరిగా తాగాలి. ఈ రసం శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తాయి. పెద్దప్రేగు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగాలి. మంచి ఉపశమనం పొందుతారు.

ఉప్పునీరు

ఆరోగ్య నిపుణులు పేగును శుభ్రపరచడానికి ఉప్పునీరు కూడా తాగమని సూచిస్తున్నారు. 2010లో పేగు ప్రక్షాళనకు సంబంధించి ఒక అధ్యయనంలో, ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల ప్రేగులు శుభ్రం అవుతాయని తేలింది. రెండు టీస్పూన్ల ఉప్పు, ఒక గ్లాసు గోరువెచ్చని నీటి ద్రావణంలో కలిపి తీసుకోవాలి. ప్రేగులను శుభ్రపరచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎసిడిటీని దూరం చేసి జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఈ రసం కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను చంపి, పేగును బాగా శుభ్రపరుస్తుందని తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories