Natural Drinks: ఈ డ్రింక్స్‌ తాగితే అలసట దూరం.. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది..!

If you Drink These Drinks you will get rid of Fatigue the Body Will get Instant Energy
x

Natural Drinks: ఈ డ్రింక్స్‌ తాగితే అలసట దూరం.. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది..!

Highlights

Natural Drinks: చాలామంది అలసిపోయినప్పుడు టీ లేదా కాఫీ తాగుతారు.

Natural Drinks: చాలామంది అలసిపోయినప్పుడు టీ లేదా కాఫీ తాగుతారు. ఇది వారి అలసటను దూరంచేసి వెంటనే తాజా అనుభూతిని అందిస్తుంది. కానీ టీ లేదా కాఫీ మిమ్మల్ని కొద్దిసేపు మాత్రమే ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. తర్వాత మీరు మళ్లీ అలసిపోతారు. అందుకే సహజసిద్దమైన ఎనర్జీ డ్రింక్స్‌ తాగాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. మిమ్మల్ని రోజుమొత్తం తాజాగా ఉంచుతాయి. అలాంటి ఎనర్జీ డ్రింక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

అరటి మిల్క్ షేక్

దీని తయారీకి అరటిపండు, బాదం, జీడిపప్పు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగాలి. అరటిపండ్లలో పొటాషియం వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే అరటిపండుతో చేసిన షేక్ తాగితే రోజంతా శక్తివంతంగా ఉంటారు.

మూలికా టీ

దీని కోసం ఒక గిన్నెలో గ్లాసు నీటిని తీసుకొని అందులో ఏలకులు, అల్లం, పసుపు వేసి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలుపుకొని తాగాలి. ఈ హోంమేడ్ హెర్బల్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఫుల్ ఎనర్జీని పొందుతారు.

దానిమ్మ రసం

దానిమ్మలో విటమిన్లు సి, కె, ఇ, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని ఉపయోగం రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ డ్రింక్‌ తక్షణమే అలసటని దూరం చేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తుంది. అంతేకాకుండా దీనిని తయారుచేయడం చాలా సులభం. ఇంకా నిమ్మకాయ ధర కూడా తక్కువగానే ఉంటుంది. దీనిని ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తాగితే ఎలాంటి అలసట ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories