Health Tips: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే పొట్ట క్లీన్‌.. అవేంటంటే..?

If You Drink These Drinks Every Morning Your Stomach Will be Clean
x

Health Tips: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే పొట్ట క్లీన్‌.. అవేంటంటే..?

Highlights

Health Tips: మలబద్ధకం అనేది నేటి కాలంలో చాలా సాధారణమైన సమస్య.

Health Tips: మలబద్ధకం అనేది నేటి కాలంలో చాలా సాధారణమైన సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు కడుపు అంత సులభంగా క్లియర్‌ కాదు. దీని కారణంగా మీరు గంటల తరబడి టాయిలెట్లో కూర్చోవలసి ఉంటుంది. కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల ఆరోగ్యం, మనస్సు రెండూ నిలకడగా ఉండవు. ఇది మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. మరోవైపు చాలా కాలం మలబద్ధకం సమస్యతో పోరాడుతుంటే అది పైల్స్‌కు కారణం అవుతుంది. అందుకే ఉదయంపూట ఈ చిట్కాలు పాటించడం వల్ల కడుపు సులువుగా క్లియర్‌ అవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం

నిమ్మకాయలో విటమిన్ సి వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి. దీని కారణంగా పొట్ట సులభంగా శుభ్రం అవుతుంది.

ఆపిల్ రసం

యాపిల్‌లో పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కడుపుని క్లీన్‌ చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఆపిల్ రసం తీసుకుంటే చాలా మంచిది.

పాలు, నెయ్యి

ఆయుర్వేదంలో పాలలో నెయ్యి కలిపి తీసుకుంటే చాలా మంచిదని చెబుతారు. నెయ్యి, పాలు మలబద్దకానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి వేసి రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీంతో ఉదయం పొట్ట సులభంగా శుభ్రం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories