Drink Less Water: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో నీటి కొరత ఉన్నట్లే..!

If You Drink Less Water These Symptoms Will Appear In The Body
x

Drink Less Water: ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో నీటి కొరత ఉన్నట్లే..!

Highlights

Drink Less Water: మన శరీరం 75 శాతం నీళ్లతో నిర్మితమైంది. రోజువారీ పనులు జరగాలంటే కచ్చితంగానీరు తాగాలి.

Drink Less Water: మన శరీరం 75 శాతం నీళ్లతో నిర్మితమైంది. రోజువారీ పనులు జరగాలంటే కచ్చితంగానీరు తాగాలి. సరిపడా నీరు లేకుంటే డీ హైడ్రేషన్‌ సమస్య ఎదురవుతుంది. ఒక వ్యక్తి తన శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రమే నీటిని తాగాలి. కానీ శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే డీహైడ్రేషన్ సమస్య, నీటి కొరత కారణంగా వ్యక్తి హాస్సిటల్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.

నీటి కొరత వల్ల సమస్యలు

శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటిలో యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్ణం ముఖ్యంగా చెప్పవచ్చు. ముఖంపై మొటిమలు రావడం ప్రారంభమవుతాయి. నీటి కొరత వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

డీ హైడ్రేషన్‌ లక్షణాలు

ముదురు పసుపు రంగు మూత్రం

శరీరంలో నీటి కొరత కారణంగా మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీనిని వెంటనే గుర్తించి నీటిని తాగాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

ముఖంపై మొటిమలు

నీరు లేకపోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు పెరిగి ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. ఈ సమస్య ఏర్పడితే సరిపడా నీరు తాగడంలేదని అర్థం.

ప్రైవేట్ పార్ట్స్‌లో దురద లేదా మంట

బాడీలో సరిపడా నీరు లేకపోతే ప్రైవేట్ పార్ట్‌లలో దురద, మంట సమస్యలు ఎదురవుతాయి. యూరిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట మొదలవుతుంది.

పొడి చర్మం

నీటి కొరత కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. చిన్న వయస్సులోనే ముడతలు కనిపించి ఏజ్‌ బార్‌గా కనిపిస్తారు.

కళ్ల కింద నల్లటి వలయాలు

నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చినప్పటికీ శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా ఇవి వస్తాయి. అలాగే సరిపడా నీరు తాగకుంటే తరచుగా తలనొప్పి వస్తుంది.

కండరాలలో నొప్పి

నీటి కొరత కారణంగా శరీరంలోని కండరాలలో నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలు మొదలవుతాయి. నీటి కొరత కారణంగా ఒక వ్యక్తి విపరీతమైన అలసట, ఒత్తిడి, గందరగోళానికి గురవుతాడు. దీని కారణంగా అతడికి చిరాకు పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories