Health Tips: నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే సులువుగా బరువు తగ్గుతారు..!

If You Do These Things Before Going to Sleep You Will Lose Weight Easily
x

Health Tips: నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే సులువుగా బరువు తగ్గుతారు..!

Highlights

Health Tips: నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే సులువుగా బరువు తగ్గుతారు..!

Health Tips: ఈ రోజుల్లో చెడు జీవనశైలి, ఆహారం కారణంగా చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే పడుకునే ముందు కొన్ని పద్దతులు పాటించండి. సులువుగా బరువు తగ్గుతారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. తేలికపాటి ఆహారం

మీరు బరువు తగ్గాలని కోరుకుంటే నిద్రించడానికి 2 గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఇది సులభంగా జీర్ణమవుతుంది. దీంతో పాటు పడుకునే ముందు కొంచెం సమయం నడవాలి.

2. ఆపిల్ సైడర్ వెనిగర్

రాత్రి భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. ఇది తరచుగా ఆహార కోరికలను తగ్గిస్తుంది. దీనివల్ల అతిగా తినకుండా ఉంటారు.

3. మద్యానికి దూరం

మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి పడుకునే ముందు మద్యపానానికి దూరంగా ఉండటం ముఖ్యం. ఆల్కహాల్‌లో చాలా కేలరీలు ఉంటాయి. నిద్రవేళకు ముందు తీసుకోవడం వల్ల వేగంగా ఊబకాయం వస్తుంది.

4. ధ్యానం చేయండి

రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం ఎంత ముఖ్యమో ధ్యానం కూడా అంతే ముఖ్యం. అందుకే రాత్రి పడుకునే ముందు కాసేపు మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు పెరగడానికి ఒత్తిడి కూడా ప్రధాన కారణం.

5. పడుకునే ముందు స్నానం

బరువు తగ్గాలనుకునే వారికి నిద్రించే ముందు వేడి నీళ్లతో స్నానం చేయడం ప్రయోజనకరం. ఎందుకంటే నిద్రించే ముందు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవడంతో పాటు బాగా నిద్ర పడుతుంది. మంచి నిద్ర వల్ల నిద్రలో కొవ్వు కరిగిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories