Working on Laptop: ల్యాప్‌టాప్‌పై నిరంతరం పనిచేస్తున్నారా.. కొంచెం ఈ విషయాలు గమనించండి..!

If you are Constantly Working on your Laptop then Relax like this
x

Working on Laptop: ల్యాప్‌టాప్‌పై నిరంతరం పనిచేస్తున్నారా.. కొంచెం ఈ విషయాలు గమనించండి..!

Highlights

Working on Laptop: ఈరోజుల్లో చాలామంది ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Working on Laptop: ఈరోజుల్లో చాలామంది ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇవి జీవితంలో ఒక భాగంగా మారాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ఏ ఆఫీసులైనా సరే కంప్యూటర్‌ ఉండాల్సిందే. వీటిపై ఎక్కువ సమయం పనిచేయడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాదు చేతులు, చేతివేళ్లు గుంజుతుంటాయి. ఇలాంటి సమయంలో ఈ చిట్కాలు పాటించి రిలాక్స్‌ అవండి.

1. సరైన స్థానం అవసరం

ల్యాప్‌టాప్, కంప్యూటర్లని సరైన స్థానంలో ఉంచాలి. లేదంటే శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను సులభంగా హ్యాండిల్‌ చేయగలిగే ప్రదేశంలో ఉంచుకోవాలి. టైప్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. స్క్రీన్ దగ్గరగా ఉందని భావిస్తే, కీబోర్డ్, స్క్రీన్‌ను సర్దుబాటు చేసుకోవడం అవసరం. అవసరమైతే ల్యాప్‌టాప్‌కి అదనపు కీబోర్డ్‌ను ఉపయోగించి పనిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.

2. వేగంగా టైప్ చేయవద్దు

కొంతమందికి కీబోర్డ్‌పై వేగంగా టైప్ చేసే అలవాటు ఉంటుంది. దీనివల్ల పని తొందరగా పూర్తవుతుందని వారు భావిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు దీనిని నివారించడం అవసరం. ఎందుకంటే వేగంగా టైప్‌ చేయడం వల్ల వేళ్లు, చేతులపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే నెమ్మదిగా టైప్‌ చేసుకోవాలి. దీనివల్ల చేతులపై ఎటువంటి ఒత్తిడి పడదు.

3. చేతులను సాగదీస్ ఉండాలి

ల్యాప్‌టాప్, కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం అవసరం. ఇది శరీర భాగాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఒక పని పూర్తి అయిన తర్వాత చేతులు, వేళ్లను సాగదీయాలి. లేదంటే సమస్య మరింత పెరుగుతుంది. పని చేస్తున్నప్పుడు పిడికిలిని 2 నుంచి 4 సార్లు మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలా వేళ్లు, చేతులను పూర్తిగా విస్తరించడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories