Womens Alert: మహిళలకి అలర్ట్‌.. ఈ చిట్కాలు పాటిస్తే లైఫ్‌ బ్యాలెన్సింగ్‌ అవుతుంది..!

If Working Women Follow These Tips Life Will be Balanced Know That
x

Womens Alert: మహిళలకి అలర్ట్‌.. ఈ చిట్కాలు పాటిస్తే లైఫ్‌ బ్యాలెన్సింగ్‌ అవుతుంది..!

Highlights

Womens Alert: ఉద్యోగం చేసే మహిళలు పెళ్లయితే కుటుంబాన్ని, ఆఫీసు పనిని మెయింటెన్‌ చేయడం కష్టమవుతుంది.

Womens Alert: ఉద్యోగం చేసే మహిళలు పెళ్లయితే కుటుంబాన్ని, ఆఫీసు పనిని మెయింటెన్‌ చేయడం కష్టమవుతుంది. ఈ రెండు విషయాలలో చాలా గందరగోళంగా వ్యవహరిస్తారు. దీనివల్ల ఇటు ఆఫీస్‌పై శ్రద్ధ పెట్టలేక, మరోవైపు ఇంటిపనిపైనా శ్రద్ధ పెట్టలేక ఆగమవుతుంటారు. అంతేకాదు ఈ సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి గురవుతారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రతిదీ ముందుగానే ప్లాన్

రోజు మొత్తం పనిని అంచనా వేసి ప్రతీది ప్లాన్‌ చేయండి. ఎప్పుడు ఏమి చేయాలి? ఎంత సమయం కేటాయించాలి అనే లెక్కలు వేసుకోండి. దీనిని బట్టి ఓ టైం టేబుల్‌ మెయింటెన్‌ చేయండి. సరైన పనిని సరైన సమయంలో పూర్తి చేయడానికి ప్రణాళిక వేసుకోండి. దీనివల్ల మీరు త్వరగా అలసిపోకుండా ఉంటారు.

ప్రాధాన్యత పనులు

చాలా మంది మహిళలు మొదట ఏ పనులకి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ కారణంగా చాలా పనులు వాయిదా వేస్తారు. ఆఫీసు, ఇంటి పనుల్లో ముందుగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. ఇంట్లో అంతా బాగుంటే మొదట ఆఫీసు పనికి ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే ఇంటిపనిపై దృష్టి సారించండి.

ఎక్కడిపని అక్కడే

ప్రొఫెషనల్‌గా ఉండటానికి ఇంటి పనిని ఆఫీసుకు, ఆఫీసు పనిని ఇంటికి తీసుకురావద్దు. ఈ విధంగా చేస్తే అది మీ జీవనశైలిపై చెడు ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ఇలా చేయకుండా ఎక్కడిపని అక్కడే పూర్తి చేయాలి.

మీ కోసం సమయం

ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉండటానికి మీ కోసం సమయాన్ని వెచ్చించడం ముఖ్యం. ప్రతిరోజు అరగంట లేదా ఒక గంట తీసుకోండి. ఈ సమయంలో మీకు సంతోషాన్ని కలిగించే పనులను చేయండి. మీరు రిఫ్రెష్‌ అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories