Health Tips: నరాలు బిగుసుకుపోవడానికి ఈ విటమిన్‌ లోపమే కారణం.. చలికాలంలో జాగ్రత్త..!

If Vitamin B12 is Lacking in the Body During Winter the Nerves get Stiff so Take These Precautions
x

Health Tips: నరాలు బిగుసుకుపోవడానికి ఈ విటమిన్‌ లోపమే కారణం.. చలికాలంలో జాగ్రత్త..!

Highlights

Health Tips: చలికాలంలో ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి.

Health Tips: చలికాలంలో ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల చాలా మందికి చేతులు, కాళ్లలో నరాలు బిగుసుకుపోతాయి. చాలా మందికి తిమ్మిర్ల సమస్య ఉంటుంది. అయితే వీటన్నింటిని అందరు చిన్నవిగా భావిస్తారు. కానీ ధీర్ఘకాలింగా ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా నరాలు బిగుసుకుపోవడానికి ఒక విటమిన్ లోపం ఉంది. దీనిలోపం వల్ల ఈ సమస్యలన్ని ఏర్పడుతాయి. అదేంటో దానిని ఎలా పొందాలో ఈ రోజు తెలుసుకుందాం.

చలికాలంలో నరాలు బిగుసుకుపోవడం, జలదరింపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు విటమిన్ బి12 లోపానికి సంకేతాలు. ఈ విటమిన్ శరీరంలోని అనేక విధులకు అవసరం. శరీరంలో దీని లోపం ఉంటే అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి. నాడీ కణాలు, రక్త కణాల ఏర్పాటులో విటమిన్ B12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ నరాలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది శరీరంలో లేదంటే నరాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.

విటమిన్ B12 మెదడులో మైలిన్ తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇది లేదంటే ఈ పదార్ధాన్ని తయారు చేయడం కష్టం. విటమిన్ బి12 లోపం మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇది బలహీనమైన జ్ఞాపకశక్తికి కారణం అవుతుంది. విటమిన్ B12 ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో లేదంటే రక్తం ఏర్పడటం సరిగ్గా జరగదు. దీని కారణంగా శరీరంలో రక్తం లోపం ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత సమస్య ఎదురవుతుంది.

శ్వాసకోశ వ్యాధి

విటమిన్ B12 లోపం శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని లోపం కారణంగా శ్వాసలోపం సమస్య ఏర్పడుతుంది. మెరుగైన ఆహారం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. మాంసం, చేపలలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ట్యూనా, షెల్ఫిష్ చేపలలో సమృద్దిగా ఉంటుంది. ఇది కాకుండా విటమిన్ B12 లోపాన్ని పాల ఉత్పత్తుల ద్వారా కూడా తొలగించవచ్చు. అంతేకాదు తృణధాన్యాలు కూడా ఉత్తమ ఎంపిక.

Show Full Article
Print Article
Next Story
More Stories