Iron Deficiency: ఈ లక్షణాలు ఉంటే ఐరన్‌ లోపం.. వయసు ప్రకారం ఎంత ఉండాలంటే..?

If These Symptoms are Iron Deficiency how Much Should be According to Age
x

Iron Deficiency: ఈ లక్షణాలు ఉంటే ఐరన్‌ లోపం.. వయసు ప్రకారం ఎంత ఉండాలంటే..?

Highlights

Iron Deficiency: మంచి ఆరోగ్యానికి చాలా ఖనిజాలు అవసరం.

Iron Deficiency: మంచి ఆరోగ్యానికి చాలా ఖనిజాలు అవసరం. వాటిలో ఐరన్ ఒకటి. నేటి రోజుల్లో చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో తగినంత ఐరన్‌ ఉండటం లేదు. దీనివల్ల చాలామంది రక్తహీనతకి గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఐరన్‌ వల్ల శరీరం సక్రమంగా పనిచేస్తుంది. దీని ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. అందుకే తగినంత ఐరన్‌ తీసుకోవడం అవసరం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఐరన్ లోపం లక్షణాలు

1. అన్ని వేళలా అలసిపోయినట్లు అనిపించడం

2. నాలుక తరచుగా పొడిబారడం

3. చాలా దాహంగా అనిపించడం

4. అన్ని సమయాలలో బలహీనత అనిపించడం

5. అధిక జుట్టు రాలడం

6. గొంతు నొప్పి పెరగడం

7. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఏ వయస్సులో ఎంత ఐరన్ అవసరం?

ప్రతి వయస్సులో స్త్రీలు, పురుషులలో ఐరన్‌ భిన్నంగా ఉంటుంది. పిల్లల కంటే యువతకు ఈ ఖనిజం చాలా అవసరం. స్త్రీలు ప్రతినెలా రుతుచక్రంలో భాగంగా రక్తాన్ని కోల్పోవలసి ఉంటుంది కాబట్టి వారికి పురుషుల కంటే ఎక్కువ ఐరన్ అవసరమవుతుంది.

1. 4 నుంచి 8 సంవత్సరాల వయస్సు పిల్లలకి - రోజువారీ 10 mg ఐరన్ అవసరం.

9 నుంచి 13 సంవత్సరాల వయస్సు వారికి రోజువారీ 8 mg ఐరన్‌ అవసరం.

19 నుంచి 50 సంవత్సరాల మహిళలకి రోజువారీ 18 mg ఐరన్‌ అవసరం.

19 నుంచి 50 సంవత్సరాల పురుషులకి రోజువారీ 8 mg ఐరన్‌ అవసరం.

ఐరన్ రిచ్ ఫుడ్స్

బాదం, జీడిపప్పు, వాల్‌నట్, తులసి, బెల్లం, వేరుశెనగ, నువ్వులు, దుంప, ఉసిరి, జామున్, పిస్తా, నిమ్మకాయ, దానిమ్మ, ఆపిల్, పాలకూర, ఎండు ద్రాక్ష, అంజీర్, జామ, అరటిపండు, మొలక మొదలైనవి ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories