Cancer: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్‌కి సంకేతం.. ఏంటంటే..?

If these 5 Symptoms Appear in the Body it is a Sign of Cancer
x

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్‌కి సంకేతం.. ఏంటంటే..?

Highlights

Cancer: క్యాన్సర్ అనేది ఒక పెద్ద వ్యాధి. దీన్ని ప్రారంభంలోనే నివారించడం చాలా సులభం.

Cancer: క్యాన్సర్ అనేది ఒక పెద్ద వ్యాధి. దీన్ని ప్రారంభంలోనే నివారించడం చాలా సులభం. జాగ్రత్తలు తీసుకోకపోతే క్యాన్సర్ మూడో దశకు చేరుకుంటుంది. అప్పుడు ప్రజలను రక్షించడం చాలా కష్టం అవుతుంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం లక్షణాలని గుర్తించడం. తద్వారా మూడో దశకు చేరకుండా నిరోధించవచ్చు. శరీరంలో క్యాన్సర్ లక్షణాలు లేదా హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

1. మలంలో రక్తం

అల్సర్, పైల్స్ లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా మలంలో రక్తం వస్తుంది. కానీ క్యాన్సర్ ఉన్నవారికి కూడా మలంలో రక్తిం వస్తుంది. గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ట్రాక్ట్‌లో ఏదైనా సమస్య కారణంగా మలంలో రక్తం వస్తుంది. అయితే, రెండు సందర్భాల్లోనూ తనిఖీ చేయడం అవసరం.

2. ఆకలి లేకపోవడం

క్యాన్సర్ మీ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఆకలి ఉండదు. మీకు కడుపు, ప్యాంక్రియాస్, పెద్ద ప్రేగు లేదా అండాశయ క్యాన్సర్ ఉంటే కడుపులో నొప్పిని అనుభవిస్తారు. దీని కారణంగా మీకు ఆకలి ఉండదు. క్యాన్సర్ ఉన్నప్పుడు స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి అస్సలే ఉండదు.

3. మూత్రంలో రక్తం

మూత్రంలో రక్తం ఉంటే అది క్యాన్సర్ పెద్ద సంకేతం. ఇది కిడ్నీ లేదా మూత్రాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. కిడ్నీలో రాళ్లు వచ్చినా, కిడ్నీ వ్యాధి వచ్చినా కూడా ఇలాంటి సమస్యే వస్తుంది. కానీ వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

4. దగ్గు

ఎప్పటికీ తగ్గని దగ్గు కూడా క్యాన్సర్‌కు కారణం. దగ్గు చికిత్స పొందిన తర్వాత కూడా తగ్గకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, గొంతు బొంగురుపోవడం, అలసట, శ్వాస ఆడకపోవడాన్ని కలిగిస్తుంది. ఇటువంటి లక్షణాలు జలుబు-ఫ్లూలో కూడా కనిపిస్తాయి. కానీ వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

5. మెడలో గడ్డలు

నోటి, గొంతు, థైరాయిడ్, గడ్డలు కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. క్యాన్సర్ ముద్దలో ఎప్పుడూ నొప్పి ఉండదు. ఇది ఎప్పటికీ పోదు. క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. మీకు ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories