Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. గుర్తించకపోతే చాలా ప్రమాదం..!

If There are Stones in the Kidney These Symptoms Will Appear
x

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. గుర్తించకపోతే చాలా ప్రమాదం..!

Highlights

Kidney Stones: కిడ్నీ స్టోన్ సమస్య చాలా తీవ్రమైనది. దీనివల్ల కిడ్నీఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

Kidney Stones: కిడ్నీ స్టోన్ సమస్య చాలా తీవ్రమైనది. దీనివల్ల కిడ్నీఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ స్టోన్ ఏర్పడినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించి చికిత్స అందించినట్లయితే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. అయితే అసలు రాయి అంటే ఏమిటి అది వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

కిడ్నీ స్టోన్ లేదా కాలిక్యులస్ అనేది కిడ్నీలో పేరుకుపోయే ఒక రకమైన చిన్న రాయి. వాస్తవానికి శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడానికి కిడ్నీ పనిచేస్తుంది. ఒక్కోసారి టాక్సిన్స్ పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు సాధారణంగా కాల్షియం వంటి ఖనిజాలు చేరడం వల్ల ఏర్పడతాయి. మూత్రపిండాలే కాకుండా ఇది మూత్ర నాళంలోకి కూడా ప్రవేశించవచ్చు.

వెన్ను, కడుపు నొప్పి

కిడ్నీ స్టోన్ కారణంగా తీవ్రమైన నొప్పి సమస్య ఉంటుంది. రాళ్ల వల్ల కడుపు నొప్పి, వెన్నునొప్పి వస్తుంది. రాయి చిన్నగా ఉంటే నొప్పి తక్కువగా ఉంటుంది. అయితే అది పెరిగినప్పుడు భరించలేని నొప్పి ఉంటుంది.

మూత్రం వాసన

కిడ్నీలో రాయి ఉంటే మూత్రం వాసన వస్తుంది. దుర్వాసన ఎక్కువగా ఉంటే అది కిడ్నీ స్టోన్ లక్షణంగా చెప్పవచ్చు. చాలా సార్లు, మందులు తీసుకోవడం వల్ల మూత్రంలో దుర్వాసన సమస్య ఉంటుంది.

మూత్రంలో రక్తం

కిడ్నీ స్టోన్ కారణంగా మూత్రంలో రక్తం వచ్చే సమస్య ఉంటుంది. రక్తాన్ని చూసి వైద్యులు మూత్రపిండాల్లో రాళ్లను గుర్తించవచ్చు. ఈ రక్తం చాలా తక్కువ పరిమాణంలో బయటకు వస్తుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories