Health Tips: పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తేనెలో ముంచి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!

If Garlic Cloves Are Dipped In Honey All These Health Problems Will Be Removed
x

Health Tips: పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తేనెలో ముంచి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!

Highlights

Health Tips: ప్రతి ఇంట్లో ఉండే కిచెన్‌లో ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగిన మసాలాలు ఉంటాయి.

Health Tips: ప్రతి ఇంట్లో ఉండే కిచెన్‌లో ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగిన మసాలాలు ఉంటాయి. కానీ వీటిని ఉపయోగించడానికి చాలామంది బద్దకంగా ఫీలవుతారు. మార్కెట్‌లో లభించే ట్యాబ్లెట్ల కన్నా ఇవి ఆరోగ్యానిక చాలా మేలు. పైగా ఎటువంటి సైడ్‌ ఎఫెక్స్ ఉండవు. వంటగదిలో లభించే వాటిలో వెల్లుల్లి ఒకటి. పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిని తేనెలో ముంచుకొని తింటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. ఈ రోజు వెల్లుల్లిని తేనెలో కలుపుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అదే సమయంలో తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తేనెను వెల్లుల్లితో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి.

రోగనిరోధక శక్తి

తేనె, వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

గొంతు మంట

చలికాలంలో గొంతు సమస్యలు రావడం సర్వసాధారణం. గొంతు నొప్పిని నయం చేయడానికి తేనె, వెల్లుల్లి సహజ మార్గం. వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే గొంతు ఇన్ఫెక్షన్ నయమవుతుంది.

బరువు తగ్గుతారు

స్థూలకాయంతో బాధపడేవారు ఖచ్చితంగా వెల్లుల్లి, తేనె తీసుకోవాలి. దీని వినియోగం జీవక్రియను పెంచుతుంది. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె, వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు.

గుండె ఆరోగ్యం

తేనెతో కూడిన వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెను దృఢంగా మార్చే గుణాలు ఇందులో ఉంటాయి.

జీర్ణక్రియ

తేనెతో వెల్లుల్లి కడుపుకు చాలా మంచిదని భావిస్తారు. దీంతో పొట్టలోని మురికి మొత్తం తొలగిపోయి ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తేనె, వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

వెల్లుల్లి, తేనె ఎలా ఉపయోగించాలి..?

మీరు గాజు సీసాలో తేనె తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బను పొట్టు తీసి వేసి 1 వారం పాటు తేనెలో నాననివ్వాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఈ వెల్లుల్లి రెబ్బను తేనెతో కలిపి నమిలి తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories