Mint Leaves: పుదీనాను ఇలా వాడితే.. డార్క్‌ సర్కిల్స్‌ బలదూర్‌

How to use mint leaves for remove dark circles
x

Mint Leaves: పుదీనాను ఇలా వాడితే.. డార్క్‌ సర్కిల్స్‌ బలదూర్‌ 

Highlights

పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యాన్ని సంరక్షించడంలో పుదీనా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పుదీనా ఉపయోపగుడుతంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ ఏర్పడే డార్క్‌ సర్కిల్స్‌ను సమర్థవంతంగా తగ్గించడంలో పుదీనా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, ఎక్కువసేపు ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లను ఉపయోగించడం, ఒత్తిడి కారణంగా కళ్ల చుట్టూ డార్క్‌ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతంది. ఇలాంటి సమస్యకు పుదీనా బెస్ట్‌ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఇంతకీ పుదీనాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది చర్మానికి రక్తాన్ని సరఫరా చేయడంలో సహాయపడుతుంది. డార్క్ సర్కిల్స్ కనిపించేలా చేసే రంగును తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని స్వేచ్ఛా రాశుల నుంచి రక్షిస్తాయి. దీంతో వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక పుదీనా ఆకులను నేరుగా ఉపయోగించడం ద్వారా కూడా డార్క్‌ సర్కిల్స్‌ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

పుదీనా పేస్ట్‌ను అప్లై చేయడం ద్వారా డార్క్‌ సర్కిల్స్‌ తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా రుబ్బి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను డార్క్‌ సర్కిల్స్‌ ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్‌ సర్కిల్స్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది

ఇక పుదీనా ఐస్‌ క్యూబ్స్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం పుదీనా ఆకులతో రసం తయారు చేసుకోవాలి. అనంతరం ఆ సాన్ని ఐస్‌ క్యూబ్స్‌ ట్రేలో వేసి ఫ్రిజ్‌ పెట్టాలి. ఇలా తయారైన ఐస్‌ క్యూబ్స్‌ను డార్క్‌ సర్కిల్స్‌ మీద రుద్దాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా టీ కూడా ఇందుకు ఉపయోగపడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల శరీరం లోపల నుంచి డీటాక్స్ అవుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్‌: ఈ వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories