Health Tips: జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా.. ఈ పనులని వెంటనే ఆపేయండి..!

How to Stop Hair From Graying Stop These Things Immediately
x

Health Tips: జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా.. ఈ పనులని వెంటనే ఆపేయండి..!

Highlights

Health Tips: తెల్ల జుట్టు వృద్ధాప్యానికి పెద్ద సంకేతంగా పరిగణిస్తారు.

Health Tips: తెల్ల జుట్టు వృద్ధాప్యానికి పెద్ద సంకేతంగా పరిగణిస్తారు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య తలపై తెల్ల జుట్టు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో రోజువారీ అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవాలసి ఉంటుంది. అప్పుడే తెల్ల జుట్టు రాకుండా ఆపవచ్చు. అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. టెన్షన్‌ని వదిలేయండి

నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో ఒక వ్యక్తికి చాలా బాధ్యతలు ఉంటాయి. వీటి కారణంగా టెన్షన్ పెరిగిపోతుంది. ఒత్తిడి వల్ల వెంట్రుకలు తెల్లబడతాయని అనేక పరిశోధనల్లో తేలింది. అందువల్ల వీలైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. దీని కోసం ధ్యానం సహాయం తీసుకోవచ్చు.

2. అనారోగ్యకరమైన ఆహారం

మనలో చాలామంది ఆయిల్, జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనివల్ల జుట్టుకి హాని జరుగుతుంది. చిన్నవయసులోనే తెల్లజుట్టు రావడం మొదలవుతుంది. దీని కోసం ఆహారంలో ప్రోటీన్, బయోటిన్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, జింక్‌తో కూడిన ఆహారాన్ని చేర్చుకోవాలి.

3. ఎక్కువగా నిద్రపోండి

తక్కువ నిద్ర వల్ల శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావం ఉంటుంది. కానీ ఇది మన జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతమైన పెద్దలు రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి లేదంటే తెల్లజుట్టు రాకుండా ఆపలేరు.

4. ఆయిల్ మన జుట్టుకు అంతర్గత పోషణతో పాటు బాహ్య పోషణ అందిస్తుంది. తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే నేచురల్ ఆయిల్స్‌తో తలకు మసాజ్ చేయాలి. దీని కోసం మీరు ఆలివ్ నూనె, ఆముదం, ఆవనూనె, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.

5. ధూమపానం వదిలేయండి

చాలా మంది యువకులు సిగరెట్, బీడీ, సిగార్, గంజాయి, హుక్కాకు అలవాటు పడుతున్నారు. కానీ అది మన జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ అలవాటు మానేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories