Relationship Tips: మాజీ భాగస్వామితో మళ్లీ జత కట్టడం ఎలా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

How To Get Back Together With Ex-Partner Try These Tips
x

Relationship Tips: మాజీ భాగస్వామితో మళ్లీ జత కట్టడం ఎలా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!

Highlights

Relationship Tips: ఈ రోజుల్లో లవ్‌చేయడం, పెళ్లిచేసుకోవడం, విడిపోవడం కామన్‌గా మారాయి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఈగోలకు పోయి విడిపోయిన వారు ఎందరో ఉన్నారు.

Relationship Tips: ఈ రోజుల్లో లవ్‌చేయడం, పెళ్లిచేసుకోవడం, విడిపోవడం కామన్‌గా మారాయి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఈగోలకు పోయి విడిపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాగే విడిపోయిన తర్వాత ఒకరినొకరు పూర్తిగా తెలుసుకొని జీవితాన్ని గడుపుతున్నవారు ఉన్నారు. అయితే విడిపోయిన తర్వాత మళ్లీ ఎలా జతకట్టాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. స్నేహితుడి సాయం తీసుకోండి

విడిపోయిన తర్వాత మీ మాజీతో నేరుగా మాట్లాడటం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరికి ఉండే కామన్‌ ఫ్రెండ్‌ సాయం తీసుకోండి. ఇతడితో మీరు వారిని ఎంత మిస్‌ అవుతున్నారో తెలియజేయండి. నిజాయితీగా మళ్లీ మిమ్మల్ని కోరుకున్నట్లు చెప్పండి. అప్పుడు వారు మీ గురించి ఆలోచించే అవసరం ఉంది.

2. మెస్సేజెస్‌ పంపంచండి

విడిపోయిన తర్వాత ఒకరినొకరు ఫోన్‌కాల్స్ చేసుకొని మాట్లాడుకోవడం కొంచెం కష్టమే. అందుకే మెస్సేజెస్‌ ద్వారా మీ భావాలను వ్యక్త పరచండి. దీనివల్ల మీ మనసులో మాట వారికి తెలుస్తుంది. అయితే ఇందులో విడిపోడానికి మీ తప్పులేకపోయినా వారి గురించి చెడుగా రాయవద్దు. దీనివల్ల మీ పై మంచి అభిప్రాయం ఏర్పడి మళ్లీ కలవడానికి అవకాశాలు ఉంటాయి.

సోషల్ మీడియాలో బాధను వ్యక్తం చేయవద్దు

ఈ మధ్య విడిపోయిన తర్వాత సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్టేటస్‌లు పెట్టుకోవడం, ఇతర పద్దతుల ద్వారా వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలా ఎప్పుడు చేయవద్దు. కొన్నిసార్లు ఒకరినొకరు నిందించుకుంటారు. దీనివల్ల మళ్లీ కలిసే అవకాశాలు ఉండవు. అందుకే బాధను ఈ పద్దతుల్లో ఎప్పుడు వ్యక్తం చేసుకోకూడదు.

బహిరంగంగా ఒప్పుకోండి

మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక మీరు ఏ కారణం చేత విడిపోయారో దానిపై చర్చించుకోండి. ఒకరు చేసిన తప్పులను ఒకరు అంగీకరించుకోండి. దీనివల్ల ఈగోలు పోయి ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. మళ్లీ కలిసి గొడవపడకుండా జీవితం గడిపే అవకాశాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories