Sunlight: మానసిక ఆరోగ్యానికి సూర్యరశ్మి గొప్ప ఔషధం.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

How Sunlight is Useful for Mental Health Know What are its Benefits
x

Sunlight: మానసిక ఆరోగ్యానికి సూర్యరశ్మి గొప్ప ఔషధం.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Highlights

Sunlight Benefits: చలి పెరగడంతో భారతదేశం మొత్తం వణికిపోతోంది.

Sunlight Benefits: చలి పెరగడంతో భారతదేశం మొత్తం వణికిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు వేడిని కోరుకుంటారు. ఉదయమే నులివెచ్చని సూర్యకిరణాల కోసం ఎదురుచూస్తారు. ఇవి మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. సూర్య కిరణాలు మానసిక ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.

కరోనా సమయంలో ప్రజలు మానసిక ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్‌ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. సూర్యకాంతి మీ సిర్కాడియన్ రిథమ్‌ను సెట్‌ చేయడంలో సహాయపడుతుంది. ఇది సెరోటోనిన్ అనే నిర్దిష్ట హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్‌ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీకు శాంతిని అందిస్తుంది. దృష్టిని పెంచుతుంది. ఎండలో కూర్చోవడం వల్ల ఒత్తిడి, దుఃఖం, ఒంటరితనం దూరం అవుతాయి. మీకు అలసట, సోమరితనం అనిపిస్తే సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

విటమిన్ డి

సూర్యకాంతి విటమిన్ D3ని అందిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని శక్తివంతమైన ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు శరీరంపై ఏర్పడే మంటలని తగ్గిస్తాయి. నిద్ర విధానాలని మెరుగుపరుస్తాయి. సెరోటోనిన్‌ను విడుదల చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. సూర్యరశ్మి మన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కలర్ థెరపీ కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories